‘బండ్ల’ టైటిల్ కొట్టేసిన ‘కొరటాల’?

భలే చిత్రంగా వుందిగా… నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. దేవర అనేది ఆ టైటిల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ పిలుచుకునే…

భలే చిత్రంగా వుందిగా… నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. దేవర అనేది ఆ టైటిల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ పిలుచుకునే పేరు అది. అందుకే రిజిస్టర్ చేసి వుంచాడు. ఈ మధ్య రెన్యూవల్ చేయించడం మరిచిపోయాడు. 

ఇప్పుడు ఈ టైటిల్ ను దర్శకుడు కొరటాల శివ తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ రిజిస్టర్ చేసి కొరటాల దగ్గర పెట్టుకున్నారు.

ఇంతకీ ఈ టైటిల్ ను ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసమా? లేదా టైటిల్ బాగుందని తీసుకున్నారా అన్నది తెలియాల్సి వుంది. ఈ విషయం తెలిసి నిర్మాత బండ్ల గణేష్ స్వయంగా ఫోన్ చేసి కొరటాలను ఇదేం పని అని అడిగినట్లు తెలుస్తోంది. తను అందరి కన్నా ముందుగా కొరటాలకు అడ్వాన్స్ ఇచ్చానని, సినిమా చేయకపోయినా, ఆ మాత్రం గౌరవం కూడా లేదా అని అడిగినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద పవన్ కళ్యాణ్ కోసం వుంచుకున్న దేవర టైటిల్ ఇప్పుడు కొరటాల శివ దగ్గర వుంది. మరి అది దేనికి వాడతారో చూడాల్సి వుంది.