రికార్డులు సృష్టిస్తున్న ఢమాగా సాంగ్

ఒక్కోసారి అంతే..ఒక్కోపాట ఎక్కడికో వెళ్లిపోతుంది. వైరల్ అయిపోతుంది. ఒక్కోసారి మంచి పాట అనుకున్నది అలా అక్కడే వుండిపోతుంది. జ‌నాలకు హుక్ లా పట్టుకునే లక్కు ఒక్కో సీజ‌న్ లో ఒక్కో పాటకు దక్కుతుంటుంది. ఈ…

ఒక్కోసారి అంతే..ఒక్కోపాట ఎక్కడికో వెళ్లిపోతుంది. వైరల్ అయిపోతుంది. ఒక్కోసారి మంచి పాట అనుకున్నది అలా అక్కడే వుండిపోతుంది. జ‌నాలకు హుక్ లా పట్టుకునే లక్కు ఒక్కో సీజ‌న్ లో ఒక్కో పాటకు దక్కుతుంటుంది. ఈ సీజ‌న్ లో అలాంటి అదృష్టం ఢమాకా సినిమాలో..’నిన్ను చూడబుద్దవుతోంది రాజిగో..మాట్లాడబుద్దవుతోంది రాజిగో’ అనే ఫోక్ ట్యూన్ సాంగ్ కు దక్కింది.

ఇప్పటికి ఈ పాట యూ ట్యూబ్ లో ముఫై మిలియన్ల ఆర్గానిక్ వ్యూస్ తెచ్చుకుంది. రెండు లక్షలకు పైగా లైక్ లు తెచ్చుకుంది. ఇక వేలాది కామెంట్లు సంగతి చెప్పనక్కరలేదు. గతంలో అనేక బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ రాసిన కాసర్ల శ్యామ్ ఈ పాట రాసారు. భీమ్స్ సిసిరియో సంగీతం అందించారు. యూ ట్యూబ్ లో, ఇన్ స్టా గ్రామ్ లొ దాదాపు రెండు లక్షల మంది రీల్స్ చేసారు.

ఇలా అన్ని విధాలా ఢమాకా సినిమాకు క్రౌడ్ పుల్లింగ్ సాంగ్ గా ఈ పాటనే నిలవబోతోంది. పెళ్లి సందడి తరువాత శ్రీలీల చేస్తున్న సినిమా ఇది. రవితేజ‌తో దర్శకుడు నక్కిన త్రినాధరావు అందిస్తున్న సినిమా. గమ్మత్తేమిటంటే ‘రాజిగో’  పాట రేంజ్ కు సినిమాలోని మిగిలిన పాటలు చేరుకోవడం కాస్త కష్టంగానే వుంది. అయితే సినిమాకు ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ అయితే చాలు ఓపెనింగ్స్ లాక్కు వస్తుంది.

డిసెంబర్ మూడోవారంలో సోలో విడుదల దక్కించుకున్న ఢమాకా సినిమాకు ఈసాంగ్ చాలు అనుకోవాలి. ఈ సినిమాకు నిర్మాత పీపుల్స్ మీడియా సంస్థ.