మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి.
చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం..
* సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె నోటి వెంటే సైరా నరసింహారెడ్డి కథ చెప్పడం ప్రారంభమవుతుంది.
* సినిమాలో సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ సాంగ్ అయిదునిమషాలకు పైగా వుంటుంది. సిరివెన్నెల ఈ పాట రాసారు.
* సినిమాలో అత్యంత కీలకమైన అండర్ వాటర్ ఫైట్ ఒకటి వుంటుంది. తమన్నా-చిరంజీవి- ఫైటర్ల మధ్య వుండే ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చుచేసారు. విదేశీ టెక్నీషియన్లు పనిచేసారు.
* సినిమా క్లయిమాక్స్ అన్నది ఎమోషనల్ గా డైలాగ్ బేస్డ్ గా వుంటుంది కాబట్టి, ప్రీ క్లయిమాక్స్ ఫుల్ యాక్షన్ తో వుంటుంది. దాని కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసారు. క్లయిమాక్స్ లో మెగాస్టార్ నోటి వెంట సూపర్ డైలాగ్స్ వస్తాయి.
* సినిమా తొలిసగం అంతా నరసింహారెడ్డి జమీందారీ జీవితం, ఆ విలాసాలు తదితర అంశాలు వుండి. ద్వితీయార్థంలో అసలు పోరాట గాధ ప్రారంభమవుతుంది.
* సైరాలో జాతర పాట ఒకటి వుంటుంది. అది మెగా మాస్ అభిమానులను ఈలలు వేసేలా చేస్తుంది.
* సినిమాలో ఏ సీన్ అయినా కూడా తెరనిండా మనుషులు. సెట్ ప్రాపర్టీస్ భారీగా వుండి ఖర్చు క్లియర్ గా కనిపిస్తూ వుంటుంది.
ఇంకా మరికొన్ని విశేషాలు మరోసారి మీ కోసం.