ఆ పని చేస్తే పవన్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే!

ప్రభుత్వం తమపై దాడులు చేస్తుందంటూ టీడీపీ ఏకంగా బాధితుల పేరుతో కొంతమందిని గుంటూరు తరలించింది. పునరావాస శిబిరం అంటూ పెద్ద డ్రామాకి తెరతీసింది. ఈ శిబిరంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి, వాళ్లను పరామర్శలు…

ప్రభుత్వం తమపై దాడులు చేస్తుందంటూ టీడీపీ ఏకంగా బాధితుల పేరుతో కొంతమందిని గుంటూరు తరలించింది. పునరావాస శిబిరం అంటూ పెద్ద డ్రామాకి తెరతీసింది. ఈ శిబిరంలో పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి, వాళ్లను పరామర్శలు చేస్తూ పెదబాబు, చినబాబు, ఇతర నేతలు భలేగా పబ్లిసిటీ స్టంట్స్ చేశారు. ఇప్పుడీ శిబిరాన్ని సందర్శించాల్సిందిగా పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. స్వయంగా చంద్రబాబే గుంటూరులో శిబిరాన్ని సందర్శించాలని, బాధితులకు బాసటగా నిలవాలని, ప్రభుత్వ అరాచకాలపై గళమెత్తాలని పవన్ ని కోరారట.

అయితే ఈ ఆహ్వానం విషయాన్ని మాత్రం టీడీపీ బైటపెట్టలేదు. పవన్ స్పందనని బట్టి దీన్ని పబ్లిసిటీకి వాడుకోవాలని చూస్తోంది. దీన్ని పార్టీతో సంబంధం లేకుండా ఓ బాధిత శిబిరంలా మాత్రమే చూడాలని, ప్రజల ఇబ్బందులను ప్రతిపక్షాలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని, అందుకే జనసేన కూడా ఈ శిబిరాన్ని సందర్శించాలని, అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి తేగలమని పవన్ కు నచ్చజెబుతున్నారట బాబు. ఈ మేరకు జనసేనలో ఒకరిద్దరు కీలక నేతలు కూడా బాధిత శిబిరాన్ని సందర్శించి వారికి భరోసా ఇవ్వాల్సిందిగా పవన్ కు చెప్పిచూశారట.

అయితే పవన్ మాత్రం ఇంకా ఈ పర్యటనపై ఓ నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ శిబిరానికి వెళ్తే పవన్ పై కచ్చితంగా బ్యాడ్ రిమార్క్ పడుతుంది. ఇప్పటికే టీడీపీ-జనసేన లోపాయికారీ ఒప్పందంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆ కల్పిత శిబిరాన్ని పవన్ పరామర్శిస్తే.. పోయిపోయి చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నట్టే. మరి ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పవన్ ఈ శిబిరంలోకి వెళ్తే మాత్రం రాజకీయంగా తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనని అంటున్నారు విశ్లేషకులు.