మోడీతో జగన్ భేటీ…ప్రత్యేకమే …?

విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ లేని విధంగా ఒక రోజు రాత్రి బస చేస్తున్నారు. ఆయన ఏడు గంటలకు ఐఎన్ఎస్ డేగా నేవీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన…

విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ లేని విధంగా ఒక రోజు రాత్రి బస చేస్తున్నారు. ఆయన ఏడు గంటలకు ఐఎన్ఎస్ డేగా నేవీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన తనకు కేటాయించిన నేవీ గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. రాత్రి ఎనిమిది నుంచి మోడీ విశాఖ షెడ్యూల్ మొదలవుతుంది.

రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఎనిమిదిన్నర నుంచి పది నిముషాల పాటు పవన్ కళ్యాణ్ కి మోడీ అపాయింట్మెంట్ ని ప్రధాని ఆఫీస్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఎనిమిది నలభై నుంచి ప్రధాని షెడ్యూల్ ని రిజర్వ్ చేసి ఉంచారు. మరి ఆ టైం లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అన్నది తెలియదు. ఈ నెల 12న ప్రధాని అఫీషియల్ షెడ్యూల్ తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది అని అధికార వర్గాలు తెలియచేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రదానికి స్వాగతం పలికాక రాత్రి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అవుతారు అని అంటున్నారు. ఒకవేళ అపుడు కుదరకపోతే కనుక 12న ఉదయం ప్రధానితో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎపుడు ఢిల్లీ వెళ్ళినా ప్రధానితో భేటీ అయ్యే ముఖ్యమంత్రి జగన్ ఈసారి సొంత రాష్ట్రంలో ఒక రాత్రి అంతా బస చేసిన క్రమంలో ఆయనతో సమావేశమై రాష్ట్ర సమస్యలతో పాటు రాజకీయాలను కూడా చర్చించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రధాని తో ముఖ్యమంత్రి భేటీకి ప్రత్యేకంగా చూడాలా లేక మర్యాదపూర్వక భేటీగా చూడాలా అన్నది తెలియదు కానీ మోడీతో జగన్ భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తారు అని అంటున్నారు.