జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి చెలరేగిపోయారు. విశాఖలో ఇవాళ ప్రధానితో పవన్‌కల్యాణ్ భేటీ నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా పవన్‌పై అమర్నాథ్ నిప్పులు చెరిగారు. టీడీపీ అనేది పవన్‌కల్యాణ్‌కు పర్మినెంట్, మిగిలిన పార్టీలన్నీ స్టెప్నీలు అని ఘాటు విమర్శ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
ప్రధాని మోదీతో పవన్ భేటీపై చెప్పాల్సిందేమీ లేదన్నారు. బీజేపీ, జనసేన కొత్తగా కలవడం లేదన్నారు. గతంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పనిచేశాయని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. పవన్‌కల్యాణ్ ఎలా పని చేయాలి, అలాగే ఆయనకు సంబంధించిన ప్రతి కదలికను టీడీపీనే చూస్తుందన్నారు. బీజేపీతో లేదా బీఎస్పీతో కలిసి ఉన్నా పవన్ ఫైనల్ టార్గెట్ తెలుగుదేశమని మంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉపయోపడతామనే తాపత్రయంతోనే పవన్ పని చేస్తారని స్పష్టం చేశారు.
బీజేపీ రోడ్ మ్యాప్‌లోకి తెలుగుదేశాన్ని కూడా తీసుకొస్తారేమో అన్నారు. ఎందుకంటే పవన్ ప్యాకేజీ తీసుకున్నది అందుకే కదా అని ఆయన సెటైర్ విసిరారు. పవన్‌కల్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే అని మరోసారి కుండబద్ధలు కొట్టినట్టు అన్నారు.
పవన్ చెప్పు చూపినా, కాలు చూపినా ఆయన ప్యాకేజీ స్టారే అని తేల్చి చెప్పారు. ఆయనకు ఒక సిద్ధాంతం, విధానం, ఆలోచన లేవన్నారు. ఎలాంటి రోడ్ మ్యాప్ లేని రాజకీయ పార్టీ ఏదైనా ఏపీలో వుందంటే అది జనసేన పార్టీ మాత్రమే అని ఆయన నిప్పులు చెరిగారు.