ప‌వ‌న్‌తో డేటింగ్‌కు రెడీ అంటున్న హీరోయిన్

టాలీవుడ్ అగ్ర‌హీరో, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో డేటింగ్‌కు ఎప్పుడెప్పుడా అని ఓ హీరోయిన్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఒక్క సినిమాతోనే ఆమె ఎంతో పాపుల‌ర్ అయ్యారు. ఎందుకంటే ఆమె సంచ‌ల‌న  ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ తీర్చిదిద్దిన హీరోయిన్. రాత్రికి రాత్రే…

టాలీవుడ్ అగ్ర‌హీరో, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో డేటింగ్‌కు ఎప్పుడెప్పుడా అని ఓ హీరోయిన్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఒక్క సినిమాతోనే ఆమె ఎంతో పాపుల‌ర్ అయ్యారు. ఎందుకంటే ఆమె సంచ‌ల‌న  ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ తీర్చిదిద్దిన హీరోయిన్. రాత్రికి రాత్రే టాలీవుడ్ సెల‌బ్రిటీ స్టార్ దక్కించుకున్న ఆ హీరోయిన్ స్వీటీ అలియాస్ శ్రీ‌రాపాక‌.

లాక్‌డౌన్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘నగ్నం’ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. ఇటీవ‌ల డిజిట‌ల్ ప్లాట్‌పాంపై విడుద‌లైంది. ఈ వెబ్ సిరీస్ త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టింద‌నే టాక్ న‌డుస్తోంది. ఇదిలా ఉంటే ‘నగ్నం’ విడుద‌ల త‌ర్వాత , ఆ సిరీస్ హీరోయిన్   శ్రీరాపాక బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు యూట్యూబ్‌ను ఓపెన్ చేస్తే చాలు…ఆమె ఇంట‌ర్వ్యూలే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అడిగిన వారికి, అడ‌గ‌ని వారికి కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ చాలా విష‌యాలు చెప్పుకొస్తున్నారామె.

తాజా ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేకెత్తించారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వివాహ విష‌యంపై అనేక కార‌ణాల రీత్యా ర‌చ్చ సాగింది. మ‌ళ్లీ ఇప్పుడు న‌గ్నం ఫేమ్ స్వీటీ ప‌వ‌న్‌తో డేటింగ్ చేయాల‌ని ఉంద‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీసిన‌ట్టైంది. ఇంత‌కూ ఇంట‌ర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే…

‘నాకు తెలుగు సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ అంటే క్రష్. అప్పట్లో ఆయనను కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశాను కూడా. కానీ కుదరలేదు. ఇక ప్రయత్నం చేయలేదు.  ఆయనంటే ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది ’ అని శ్రీరాపాక (స్వీటీ) మ‌న‌సులో గూడు క‌ట్టుకున్న ప్రేమ‌ను బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

అయితే ఈమెను తెర‌పైకి తీసుకొచ్చింది రాంగోపాల్‌వ‌ర్మ కావ‌డంతో…శ్రీ‌రాపాక‌ మాట‌ల వెనుక ఏదైనా సంథింగ్‌…సంథింగ్ ఉందా అనే అనుమానాన్ని ప‌వ‌న్ అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో  ప‌వ‌న్ త‌ల్లిని  శ్రీ‌రెడ్డి  తిట్ట‌డం వెనుక రాంగోపాల్‌వ‌ర్మ ఉన్న విష‌యం వెలుగు చూసింది. ఏది ఏమైనా స్వీటీ డేటింగ్ కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది