ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పధకాలు, ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి విజయవాడ వచ్చారు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో మొదటి మీడియా సమావేశం ఐలాపురం హోటల్లో జరిగింది.
ఆయన తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడిన తర్వాత ప్రశ్నలు మొదలయ్యాయి. ఆరోగ్యశ్రీ బాగుందని, అయితే పేదవాళ్ళే కాకుండా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ సదుపాయం పొందుతున్నారని, ఈ దుర్వినియోగాన్ని ఎలా అరికడతారని ప్రశ్న అడిగాను.
ఆయన తనదైన తరహాలో నవ్వి రెండు జవాబులు చెప్పారు.
1. “కొత్తగా నీరు వస్తున్నప్పుడు ఆ నీటితో పాటు కొంత చెత్త కూడా వస్తుంది. ఆ చెత్తను అలా వెళ్ళిపోనిస్తే తర్వాత మంచినీరు వస్తుంది. ఇదీ అంతే. ఇప్పుడేగా ప్రారంభించాం. ఇలాంటి కొంత చెత్త ఉంటుంది” అన్నారు.
2. “నేను పేదలకు ఇస్తున్నాను. వారి మధ్యలోకి ఒక ధనవంతుడు వచ్చి చేయి చాపితే దానం చేయకుండా ఎలా ఉంటాను? అన్నదానం చేస్తున్నప్పుడు ఆ వరుసలో కూర్చున్న ధనవంతుడి చేతిలో ప్లేటు లాక్కోలేము కదా? అయినా చేయిచాపి వచ్చిన వాడిని ఊరికినే ఎలా పంపిస్తాం,” అన్నారు.
ఈ రెండూ నా ప్రశ్నకు జవాబులు మాత్రమే కాదు. లోతైన మానవతా వాదం.
ఆ తర్వాత చాలా సందర్భాల్లో కలిశాను. ప్రతి సారీ చిరునవ్వే పలకరింపు..
Journalist Gopi Dara గారి అనుభవం.