బిగ్ బాస్ సీజన్ 5 ఓపెనింగ్ ప్రోగ్రామ్ కు మాంచి టీఆర్పీ వచ్చిందన్నది చానెల్ ప్రచారం. బిగ్ బాస్ కు వున్న క్రేజ్ తక్కువేమీ కాదు. అందులోనూ సీజన్ 4 బాగా క్లిక్ అయింది. దాంతో సీజన్ 5 కోసం వ్యూవర్స్ కాస్త బాగానే ఎదురుచూసారు. అక్కడి వరకు బాగానే వుంది. కానీ తొలి రెండు రోజులు గడచిన తరువాత బిగ్ బాస్ సీజన్ 5 వ్యూవర్స్ ను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిలయిందన్నది బయట వినిపిస్తున్న టాక్.
నిజానికి ఇప్పుడే ఎక్కువ మంది చూడాలి. ఎందుకంటే సినిమాలకు వెళ్లడానికి జనం ఇంకా అంతగా సుముఖంగా లేరు. వీకెండ్స్ మజా కావచ్చు, డైలీ ఎంటర్ టైన్ మెంట్ కావచ్చు ఇది ఒక్కటే. అయితే డైలీ కంటెంట్ ను వీక్షించాల్సిన మహిళలు దీని కన్నా సీరియల్స్ కే ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వున్నారు. అందుకే రెగ్యులర్ డేస్ లో బ్రాడ్ కాస్టింగ్ టైమ్ కూడా మార్చారు.
దీనికి అనేక కారణాలు వున్నాయి. అయినా కూడా జనానికి బిగ్ బాస్ సీజన్ 5 మీద ఆసక్తి కలగడం లేదు.
ఎక్కువ పరిచయం వున్న మొహాలు లేకపోవడం ఒక కారణం.
హోస్ట్ నాగ్ స్టయిల్ మరీ రొటీన్ గా వుంది. అదే డ్యాన్సర్లు, అదే లీడ్, అదే ఎంట్రీ, అదే ప్రెజెంటేషన్.
ఇక లోపల కార్యక్రమాలు కూడా మళ్లీ అదే రొటీన్. ఏదో ఒక గేమ్ ఆడించడం లేదా ఏదో ఒక టాస్క్.
ఆఖరికి ఎలిమినేషన్ ప్రొసీజర్ కు డిటో..డిటో.
ఇక అన్నింటికి మించి సీజన్ 4లో లవర్స్ డ్రామా బాగా వర్కవుట్ అయింది. కానీ తీరా బయటకు వచ్చాక అదంతా బుస్ అని, స్క్రిప్ట్ డ్ అని అర్థం అయిపోయింది. అందుకే ఈసారి కూడా మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తుంటే జనం నమ్మడం లేదు. కనెక్ట్ కావడం లేదు.
ఇలా అనేక కారణాల వల్ల బిగ్ బాస్ ప్రస్తుతానికి అయితే రక్తి కట్టడం లేదన్నది వ్యూవర్ల్ అభిప్రాయం. ఇక ఇది గమనించి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీ చేస్తారా? అవయినా ఏమైనా క్లిక్ అవుతాయా అన్నది ముందు ముందు చూడాలి.