అదేంటో కొన్ని అలా రావాలంటే లక్కు ఉండాలేమో. ఇదిలా ఉంటే ఒక చిత్రమైన ఆసక్తికరమైన అంశం విశాఖ జిల్లా పాయకరావుపేట విషయంలో జనాల్లో చర్చకు ఉంది.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితను నాటి సీఎం చంద్రబాబు టీటీడీ మెంబర్ గా నియమించారు. అయితే ఆమె మతాచారాల మీద కొన్ని విమర్శలు రావడంతో ఆ పదవి అలా జారిపోయింది.
ఇపుడు జగన్ ఇదే పాయకరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావుని టీటీడీ మెంబర్ గా నియమించారు. కానీ ఈ పదవి తనకు వద్దు అంటూ ఆయన అనడంతో అది మళ్లీ జారిపోయింది. అలా చివరిలో జరిగిన మార్పులతో బాబూరావు ప్లేస్ లో మరొకరికి ఈ పదవిని ఇచ్చారట.
ఇంతకీ బాబూరావు ఈ పదవిని ఎందుకు వద్దు అనుకున్నారు అంటే ఆయనకు మంత్రి కావాలని ఉంది అంటున్నారు. దాంతో ఆయన నో చెప్పారని టాక్. మొత్తానికి పాయకరావుపేటకు రెండు సార్లు ఇద్దరు సీఎం ల హయాంలో ఆ దేవదేవుడి సేవ చేసుకునే అవకాశం వస్తే ఆ పదవులు చేజారడం మాత్రం విశేషమే అంటున్నారు అంతా.