సమంత ముంబై షిఫ్ట్ అయిపోయింది… ఇక తెలుగు సినిమాలు చేయదు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ, సడెన్ గా సమంత ఒక తెలుగు సినిమా ఓకె చేసింది. కథ వినగానే సమంత వెంటనే పచ్చ జెండా ఊపేసి, నవంబర్ నుంచి కాల్ షీట్లు కేటాయించేసిందట.
అంతలా ఆమె కు ఈ కథ విపరీతంగా నచ్చేసిందట, నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య369', 'వంశానికొక్కడు', నానితో 'జెంటిల్మెంట్', సుదీర్ బాబు తో 'సమ్మోహనం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఇంతలా సమంత ను ఇంప్రెస్ చేసి కథ ఒప్పించింది ఓ కొత్త దర్శకుడట. సమంతకు అంతగా నచ్చింది అంటే, అది కచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ నే అయ్యుంటుంది.
ఇంతవరకు తెలుగు తెరపైనే కాదు, ఇతర ఏ భాషలోనూ రాని కథాంశమట. టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు అతిత్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు .