కొన్ని రోజులుగా తెలుగు సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన ఘటనకు సంబంధించిన కేసులో బిగ్‌బ్రేకింగ్ న్యూస్. నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని శవం రైల్వేట్రాక్‌పై కనిపించింది.
వినాయకచవితి రోజు చిప్స్ ప్యాకెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు అతి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఈ ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్‌తో ప్రాంతాలకు అతీతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిందితుడు రాజును పట్టుకునేందుకు సుమారు 3వేల మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఒకవైపు నిందితుడి కోసం వెతుకుతుండగా స్టేషన్‌ఘన్‌పూర్-వరంగల్ రైల్వేట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఇవాళ ఉదయం గుర్తించారు. మొదట గుర్తు తెలియని శవంగా భావించారు.
అయితే అతని చేతిపై మౌనిక అనే పచ్చబొట్టును చూసి, సైదాబాద్ హత్యాచార నిందితుడిగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక అధికారికంగా పోలీసులు ప్రకటించాల్సి వుంది. ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి ఏ శిక్షైతే పడాలని సమాజం కోరుకుందే, దాన్నే తనకు తానుగా నిందితుడు విధించుకోవడం గమనార్హం.