విశాఖ ను ముందుగా కమ్ముకున్నది ఎవరు?

రెడ్లకు విశాఖలో ఏం పని అన్నది తాజాగా తెలుగుదేశం నాయకులు, అభిమానుల క్వశ్చను. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అంటూ రెడ్ల పేర్లు వల్లెవేస్తున్నారు. కానీ ఈ మహానుభావులు అంతా గతం మరచిపోతున్నారు. Advertisement 1980…

రెడ్లకు విశాఖలో ఏం పని అన్నది తాజాగా తెలుగుదేశం నాయకులు, అభిమానుల క్వశ్చను. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అంటూ రెడ్ల పేర్లు వల్లెవేస్తున్నారు. కానీ ఈ మహానుభావులు అంతా గతం మరచిపోతున్నారు.

1980 దశకం ముందు విశాఖ ఏమిటి? తెలుగుదేశం ఆవిర్భావం తరువాత విశాఖ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి లెక్కలు తీస్తే ఈ మాటలు మాట్లాడే అవకాశం వుండమన్నా వుండదు. గమ్మత్తేమిటంటే విశాఖ లోకల్ జనాలు ఈ మాట ఇప్పుడు మాట్లాడడం. నిజానికి ఇదే మాటలు మూడు దశాబ్దాల కిందట మాట్లాడి వుంటే పరిస్థితి ఇలా వుండేది కాదు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు కూడా విశాఖలో కమ్మ సామాజిక వర్గం వుంది. రెడ్డి సామాజిక వర్గం వుంది. కేవలం అది వ్యాపారాలకు మాత్రమే పరిమితం. వన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక, ఏరి ఏరి మరీ కమ్మ వారికి పెద్ద పీట వేసారు. ఎమ్మెల్యే టికెట్ లు, కార్పొరేటర్ టికెట్ లు, ఎంపీ టికెట్ లు కేటాయించారు. ఆఖరికి శ్రీకాకుళం లాంటి జిల్లాకు, విశాఖ సిటీకి కూడా పార్టీ నేతలుగా వారికి అవకాశం కల్పించారు.

అప్పుడు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్న వారెవ్వరూ నోరు మెదపలేదు. భాట్టం శ్రీరామమూరి, కొమ్మూడు అప్పడు దొర, ద్రోణం రాజు లాంటి లోకల్ లీడర్లు అంతా మాయం అయ్యారు. గంటా శ్రీనివాసరావు, ఎంవివిఎస్ మూర్తి, కంభంపాటి హరిబాబు, పురంధేశ్వరి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, దాసరి వెంకటేశ్వరరావు, గద్దె బాబూరావు, వెలగపూడి ఇంకా..ఇంకా..ఇంకా…చాలా చాలా మంది, డజన్ల సంఖ్యలో తెలుగుదేశంతోనే పుట్టుకువచ్చారు. గమ్మత్తేమిటంటే వీరంతా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం అంటారు. ఆంధ్ర యూనివర్సిటీ హద్దులు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు వున్నాయి కదా.

మరి అప్పుడు ఎవ్వరూ అడగలేదేం? అంటే చివర్న రెడ్డి అని వుంటే గుర్తు పట్టడం సులువు. కానీ వీరిని గుర్తు పట్టడం తెలియకనా? కేవలం రాజకీయాలకే ఇలా అనుకుంటే వ్యాపారాలు మాత్రం ఎవరి హయాంలో ఎవరు ఎలా వెలిగారో? ఇప్పటికి విశాఖ మీద రాజకీయంగా, వ్యాపార పరంగా ఎవరి పట్టు వుందో ఓ సర్వే చేస్తే తెలిసిపోతుంది కదా?

గాజువాక ప్రాంతంలో ఏనాటి నుంచో రెడ్లు వున్నారు. తాత ముత్తాతల నుంచి అక్కడే వున్నారు. శ్రీకాకుళం జిల్లా నౌపడా ప్రాంతంలో రెడ్లు ఏనాటి నుంచో వున్నారు. అక్కడ కూడా తాత ముత్తాతల కాలం నుంచి. కానీ కమ్మవారు అలా కాదే. కేవలం మహా అయితే డెభై వ దశకం నుంచి. ఉచ్ఛ దశకు చేరింది ఎన్టీఆర్ వచ్చిన తరువాత, అధికారం అందిన తరువాత.

మరి ఇప్పుడు తెలుగుదేశం లో వున్న లోకల్స్ అంతా అప్పడూ వున్నారు. మరెందుకు వీరి గొంతులు లేవలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు లేస్తున్నాయి. అంతెందుకు ఈ గొంతులు లేపుతున్నవారంతా, రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ లు అన్నీ పక్కా గా లోకల్స్ కే కేటాయిస్తుంది అని రాసివ్వగలరా? అక్కడ అంత సీన్ వుండదని వారికీ తెలుసు. నాన్ లోకల్స్ ను నాన్ లోకల్స్ చేత పాయింట్ అవుట్ చేయిస్తే బాగోదు కనుక, లోకల్స్ ను వాడుతున్నారు. లేదూ అంటే అక్కడ అంత ప్రేమ లేదు.