మహేష్-త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూలు స్టార్ట్ కావాలంటే పూజా హెగ్డే రావాల్సిందే. ఆమె వస్తే తప్ప కాంబినేషన్ సీన్లు తీయడం కుదరదు.
ఓ ఫంక్షన్ లో కాలు మెలితి పడి, పూజా కిందపడింది. దాంతో కాలి లెగిమెంట్ కు గాయమైంది. సహజంగానే డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలన్నారు. విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత మరోసారి స్కాన్ చేయించుకుని, అంతా సెట్ అయ్యాక సెట్ మీదకు రావాల్సి వుంటుంది.
అందుకే ఈ నెలలో ప్లాన్ చేసిన మహేష్-త్రివిక్రమ్ సినిమా షూట్ మరి కాస్త వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బహుశా డిసెంబర్ తొలివారం లో వుండొచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్-మహేష్ సినిమా రకరకాల కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు పూజ కాలి గాయం సమస్య అయింది.
స్క్రిప్ట్ సమస్యలు అవి సెట్ అయ్యాయి. మిగిలినవన్నీ సెట్ చేసుకుంటున్నారు. బహుశా అన్నీ సెట్ అయితే డిసెంబర్ తొలివారం సినిమా త్రివిక్రమ్-మహేష్ సినిమా బండి చకచకా పరుగులు తీస్తుందేమో?