బీసీలపై ఎన్నాళ్లు జాలి చూపిస్తారు..?

ఒకరు ఇంకొకరిపై జాలి చూపిస్తున్నారంటే.. కచ్చితంగా ఆ జాలి పొందేవారు బలహీనులై ఉండాలి. ఒకవేళ కాకపోయినా జాలి చూపించేవారి దృష్టిలో వారు ఇంకా తక్కువవారే. రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీసీలపై విపరీతమైన జాలి…

ఒకరు ఇంకొకరిపై జాలి చూపిస్తున్నారంటే.. కచ్చితంగా ఆ జాలి పొందేవారు బలహీనులై ఉండాలి. ఒకవేళ కాకపోయినా జాలి చూపించేవారి దృష్టిలో వారు ఇంకా తక్కువవారే. రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీసీలపై విపరీతమైన జాలి చూపిస్తున్నారు. “నా బీసీ సోదరుల్ని అన్యాయం చేశారు, నా బీసీలను అరెస్ట్ చేస్తున్నారు, నా బీసీల్ని తొక్కేస్తున్నారం”టూ.. తొక్కలో సెంటిమెంట్ పండిస్తున్నారు.

ఎంతకాలం ఇంకా బీసీలను బానిసలుగానే చూస్తారు? ఎంతకాలం బీసీలపై బాబు సింపతీ చూపిస్తారు? ఎన్ని దఫాలు బీసీ ఓట్లతో ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు.  నిజంగా చంద్రబాబు దయచూపాల్సినంత దీన స్థితిలో బీసీలు లేరు. ఆయన కుల రాజకీయాలపై అవగాహన ఉంది కాబట్టే.. ఏ బీసీ సంఘం కూడా ఈ వివాదాలలో తలదూర్చలేదు. బీసీ సంఘం నాయకులెవరూ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ లకు వ్యతిరేకంగా స్పందించలేదు.

బీసీ నాయకుడు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు, ఆయన కుట్ర వల్ల చనిపోయిన వైసీపీ నేత బీసీ అనే విషయం ఎందుకు మర్చిపోయారు? చనిపోయిన బీసీకో న్యాయం, చంపించిన బీసీకి మరో న్యాయమా?

రాజకీయంగా ఐకమత్యం లేకపోవడమో లేక నాయకత్వ లోపమో.. కారణాలేవైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై తొలి నుంచీ అగ్రకులాలదే ఆధిపత్యం. కాలం కలిసొచ్చి కనీసం ఓ ఎస్సీకి అయినా ముఖ్యమంత్రి పీఠం దక్కింది కానీ.. 16 మంది సీఎంల మధ్య ఒక్క బీసీకయినా స్థానం దక్కిందా? మొహమాటానికి పదవులిచ్చారు కానీ, టీడీపీ హయాంలో బీసీలకు సరైన న్యాయం జరిగిందా?

గెలిచే సీట్లు పెద్దలకు, ఓడిపోయే సీట్లు వర్ల రామయ్యలాంటి వారికి ఇవ్వడం మొదట్నుంచీ చంద్రబాబుకి అలవాటు. అప్పటి ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకు సీటిచ్చినట్టే ఇచ్చి.. వెన్నుపోటు రాజకీయాలు చేయలేదా? బీసీలపై లేని ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు బీసీ వ్యాపారులకు సీట్లిచ్చారా, లేక బీసీల్లోని పేదలకు అవకాశాలిచ్చారో బదులు చెప్పాల్సిన పరిస్థితి.

టీడీపీలో ఉన్న బీసీలందరూ వ్యాపారాలతో పైకొచ్చి.. ఆ తర్వాత రాజకీయాల్లో ఎదిగినవారే. డబ్బులేకపోతే.. చంద్రబాబు వారిని దగ్గరకు కూడా చేరదీసేవారు కాదు. అచ్చెన్నాయుడు విషయంలో కూడా తన కొడుకు చేసిన తప్పు బైటకొస్తుందేమోనని చంద్రబాబు బాధపడుతున్నారు కానీ ఇంకోటి కాదు. రామ్మోహన్ నాయుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని వచ్చిన డిమాండ్ ని ఎంత నిరంకుశంగా అణచివేశారో జనాలకి తెలియక కాదు.

పార్టీపై పెత్తనం ఇచ్చేందుకు బీసీలు పనికి రారు కానీ, పక్కవారిపై నిందలు వేయడానికి మాత్రం బీసీల్ని పావులుగా వాడుకుంటారు. ఇదెక్కడి రాజకీయం బాబూ.. ఇంకెంతకాలం ఈ నీఛం. 

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?