ఇది సర్కారీ సవాల్…

అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరూ ఆ వైపుగా పోరు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో పూర్తి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉంటారు. వారి వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్ధులెవరూ ఈ రోజుకీ  అపజయాలు పొందలేదు.…

అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరూ ఆ వైపుగా పోరు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో పూర్తి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉంటారు. వారి వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్ధులెవరూ ఈ రోజుకీ  అపజయాలు పొందలేదు.

కానీ ఒక భ్రమ. ప్రైవేట్ విద్యాలయాల్లో చదివిస్తే తాము గొప్ప అన్న ఫాల్స్ ప్రెస్టేజ్. ఇవన్నీ కలసి ఈ రోజు దాకా ప్రైవేట్ విద్యా సంస్థలను పెంచి పోషించి కార్పోరేట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దీని మీదనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టిగానే గర్జించారు. ఇది సర్కారీ సవాల్ అంటూ ముందుకొచ్చారు కూడా.

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లతో పోటీ పడి నిలవాలని గెలవాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు సవాల్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల వెంట ఎందుకు పరుగులు అని తల్లిదండ్రులను కూడా నిలదీశారు. అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉండరని కూడా అసలు  సీక్రేట్ స్పీకర్ చెప్పేశారు.

ఆ వ్యామోహాన్ని విడనాడాలని, సర్కారీ బడులలో చేర్పించాలని కూడా తమ్మినేని హితబోధ చేశారు. మొత్తానికి జగన్ విద్యా విప్లవం కాదు కానీ ఒక వైపు ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థల కూసాలు కదులుతూంటే మరో వైపు స్పీకర్ లాంటి వారి హాట్ హాట్  కామెంట్స్ జనాలను ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. 

ఇక తల్లితండ్రులలో వస్తున్న మార్పుతో ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయంటే రానున్న కాలమంతా ప్రైవేట్ కు చేటు కాలమే కదా.