అతగాడు ఓ పెద్ద వంశానికి వారసుడు. సినిమాల్లోకి వస్తాడేమో అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఇదిగో అదిగో అనడమే కానీ రావడం కనిపించడం లేదు. ఈ లోగా ఫిజిక్ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది.
దాంతో లేటెస్ట్ ఫొటోలు బయటకు రావడం మానేసాయి. ఈలోగా కుర్రాడు మళ్లీ షేప్ అప్ అవుతున్నాడని, సినిమాల్లోకి రాబోతున్నాడని టాక్ మొదలైంది.
ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఓ హీరో బర్త్ డే పార్టీకి 'ఆ కురాడు' హాజరయ్యాడు. చూసిన వాళ్లు తగ్గడం మాట దేవుడెరుగు, మళ్లీ మామాలు షేప్ లోకే వచ్చేసాడని గమనించారు. అంతే కాదు, గతంలో వున్న 'అలవాటు' మానేసాడని టాక్ వుంది. అదీ నిజం కాదని తేలిపోయింది. పార్టీలో చేతిలో 'గ్లాస్' తో కనిపించడంతో.
ఓ మంచి కుటుంబం నుంచి సరైన వారసత్వ హీరో వస్తాడని ఎదురు చూస్తున్నవారు ఈ వార్తలు విని 'అయ్యో..' అంటూ నిట్టూరుస్తున్నారు. కుర్రాడికి సినిమాల మీద ఇంట్రస్ట్ లేకనే ఇలా వున్నాడని, నిజంగా ఇంట్రస్ట్ వుంటే షేపప్ కావడానికి ఎన్ని రోజులో పట్టదని కామెంట్ చేస్తున్నారు. ఆ ఇంట్రస్ట్ ఎప్పుడు పుడుతుందన్నదే జవాబు తెలియని ప్ర