నానీస్ గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ డైరక్షన్, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణం. ఈ సినిమా 15న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు నాని మార్కెట్ కు మించి ఖర్చుచేసారని టాక్ వుంది. సినిమా క్వాలిటీ డిమాండ్ చేయడంతో యాభై కోట్ల వరకు ఖర్చుచేసారు. సరే, ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు నాన్ థియేటర్ హక్కులు మంచి ఆదాయ వనరుగా మారాయి కాబట్టి, యాభై కోట్లు మరీ పెద్ద సమస్య కాకపోవచ్చు.
కానీ ఇలాంటి టైమ్ లో సినిమాకు ప్రమోషన్ సాంగ్ అంటూ ఓ పాట వదిలారు. ఈ సాంగ్ తయారీకి యాభై లక్షలకు పైగా ఖర్చయిందని తెలుస్తోంది. చెన్నయ్ లో రెండురోజుల పాటు డే అండ్ నైట్ కష్టపడి షూట్ చేసారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, నాని తదితరులు అందరూ పాల్గొని రూపొందించారు.
పోనీ సినిమా ప్రమోషన్ కోసం అనుకుంటే గట్టిగా వారంరోజులకు ముందు విడుదల చేసారు. ఇదేదే మరికాస్త ముందుగా చేసివుంటే జనాల్లోకి వెళ్లి హడావుడి చేసేదేమో? మొత్తంమీద కలర్ ఫుల్, ఓ ప్రమోషన్ సాంగ్ అయితే వచ్చింది. ఖర్చు మాట ఎలావున్నా, గ్యాంగ్ లీడర్ సినిమాకు ఈ పాట అయినా మాంచి బజ్ తీసుకువస్తే, నిర్మాతలకు పెద్ద కష్టం అనిపించదు.