పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లారు. ఉత్తరాంధ్ర పర్యటన నుంచి వచ్చి, బ్రహ్మానందం కుమారుడి పెళ్లికి హాజరయిన రాత్రి బయల్దేరి విదేశాలకు వెళ్లారని తెలుస్తోంది.
పవన్‌కు తన పుట్టిన రోజుకు హడావుడి చేయడం ఇష్టం వుండదు. అందుకే ప్రతి సారీ పుట్టిన రోజుకు ఓ వారం అటు ఇటుగా అందరికీ దూరంగా వుంటారు. ఈసారి విదేశాలకు వెళ్లారని తెలుస్తోంది. పవన్ భార్య, పిల్లలు విదేశాల్లో వున్నారు. సింగపూర్ అని అంటారు. అందుకే అక్కడే పవన్ వెళ్లి వుంటారని తెలుస్తోంది.
విదేశాల నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నది క్లారిటీ లేదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీదకు సెప్టెంబర్ 7న వస్తారని తెలుస్తోంది. ఆ సినిమా షూట్ సెప్టెంబర్ 5న ప్రారంభం అవుతుంది. ఈ సినిమా షూట్ రెండు వారాలు పైనే వుండొచ్చు.
ఉస్తాద్ సినిమాకు మొత్తం 60 రోజులు కేటాయిస్తారట. సెప్టెంబర్ లో ఉస్తాద్ షూట్ తరువాత ఒకటి రెండు రోజులు మంగళగిరి లేదా పొలిటికల్ యాక్టివిటీ వుంటుందని అంటున్నారు.
అక్టోబర్‌లో ఇరవై రోజులు ఓజి సినిమా మీద వర్క్ చేస్తారు. ఓజి లేదా ఉస్తాద్ ను సంక్రాంతి బరిలోకి దింపాలన్నది పవన్ ఆలోచనగా వినిపిస్తోంది. ఓజి రావడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.