పేజ్ 3 కేక్ షాప్

కేక్..ఈ పదం తెలియని పల్లెటూరు, పట్నం, నగరం ఏదీ వుండదు. కేక్, స్పంజ్ కేక్, కూల్ కేక్, ఇలా రకరకాల పేర్లు జనాలకు సుపరిచితం. ఏడాదికి ఒకసారైనా ఒక్క కేక్ అయినా కొనని ఫ్యామిలీ…

కేక్..ఈ పదం తెలియని పల్లెటూరు, పట్నం, నగరం ఏదీ వుండదు. కేక్, స్పంజ్ కేక్, కూల్ కేక్, ఇలా రకరకాల పేర్లు జనాలకు సుపరిచితం. ఏడాదికి ఒకసారైనా ఒక్క కేక్ అయినా కొనని ఫ్యామిలీ వుంటుందని అనుకోవడానికి లేదు. అయితే కేక్ అంటే అంత వరకే తెలుసు. మహా అయితే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో వుండే పెద్ద పెద్ద కేక్ షాప్ ల గురించి మరి కొంచెం తెలుసు. అయితే అక్కడ కేక్ లతో పాటు, ఇంకా అనేకానేకం విక్రయిస్తుంటారు. ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్ ల మాదిరగానో, కాఫీ షాప్ ల మాదిరిగానో వుంటాయి.

కానీ అచ్చంగా కేక్ లకే అంకింతమైన, కేక్ లు మాత్రమే ఆర్డర్ మీద తయారు చేసి విక్రయించే, అసలు కేక్ షాప్ కూడా ఓ డిజైనర్ స్టూడియో మాదిరగా వుండడం అన్నది ఎక్కడయినా గమనించారా? లేదు కదా? అయితే ఛలో హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ నెంబర్ 36. అక్కడ వున్న వినీల యడ్లవల్లి కేక్ షాప్ చూద్దాం. సారీ, కేక్ షాప్ కాదు, కేక్ స్టూడియో. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే డిజైనర్ కేక్ స్టూడియో. యస్..డిజైనర్ కేక్ స్టూడియో.

మీరు మీ అకేషన్, మీ అభిరుచి, కేక్ ఎవరి కోసం, వారి ప్రొఫెషన్, ఇలా అన్ని వివరాలు అందిస్తే కేక్ డిజైన్ తయారుచేయడం ప్రారంభిస్తారు. ఓ కాన్సెప్ట్ అనుకుని, దాని ప్రకారం కేక్ ను డిజైన్ చేసి, మీరు ఓకె చేసాక, అప్పుడు కేక్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కేక్ ఫ్లావర్, క్వాలిటీ అవన్నీ ఎలాగూ టాప్ నాచ్ లో వుంటాయి. వాటితో పాటు కేక్ మోడల్ కూడా 'సాహో' అనేట్లో, 'సైరా' అనేట్లో వుంటాయి.

వినీల యడవల్లి అనే యంగ్ ఎంటర్ పెన్యూర్ అమెరికాలో చాన్నాళ్లు వుండి, ఈ వర్క్ మీద కాస్త అభిరుచితో, నేర్చుకుని, తనుకొంత రీసెర్చి చేసారు. ఇండియాకు వచ్చేసిన తరువాత ఈ షాప్ స్టార్ట్ చేసారు.  కేవలం కేక్ షాప్ అంటే షాప్ లా వుండకూడదు. స్టూడియో అని అంటున్నందుకు స్టూడియోలా వుండాలి. డిజైనర్ అన్న పదం వాడుతున్నందుకు స్టూడియో కూడా ప్రత్యేకంగా వుండాలి. అన్ని ఆలోచించారు. అందుకే ఇప్పుడు వినీల యడవల్లి కేక్ స్టూడియోలోకి అడుగుపెడితే అదో లోకంలోకి అడుగుపెట్టినట్లు వుంది. రిచ్ నెస్ అడుగు అడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

ఇక కేక్ ల సంగతికి వద్దాం. ముందే చెప్పాంగా, కస్టమర్ ను బట్టి, అకేషన్ బట్టి, వ్యక్తులను బట్టి డిజైన్ చేయడం ప్రారంభిస్తారు అని. ఆ తరువాత కేక్ లో 90శాతం అంతా ఎడిబుల్ మెటీరియల్ నే వుంటుంది. దానికి అలంకరించే పూలు, పళ్లు, ఇంకేం అయినా, హాయిగా తినేసేయచ్చు. వాటన్నింటినీ అంత జాగ్రత్తగా, ఆర్టిస్టిక్ గా తయారుచేస్తారు. అంతా ఇంపోర్టెడ్ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ వాడడం అన్నది ఇంకో కీలకమైన పాయింట్. అలాగే ఇక్కడ రిఫ్రిజిరేషన్ వ్యవహారానికి కూడా అంతా పూర్తి అత్యాధునిక సాంకేతిక సహకారం తీసుకున్నారు. చాలా ఖరీదైన ఎక్విప్ మెంట్ అమర్చారు. మొత్తం ఇక్కడ కేక్ ఆర్డర్, తీసుకోవడం ఇదంతా కనీసం రెండు మూడు రోజుల వ్యవహారం.

వినీల కేక్ మేకింగ్ టాలెంట్ తెలిసి మెగా కోడలు ఉపాసన తన బర్త్ డే కేక్ చేయించుకున్నారు ఇక్కడే. ఆ తరువాత తన మామగారు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కేక్ చేయించారు. హైదరాబాద్ పేజ్ త్రీ పీపుల్ కేక్ డెస్టినేషన్ ఇప్పుడు ఇదే అయింది. స్టయిలిష్ స్టార్ బన్నీ జూబ్లీ 800 పబ్, అదే బన్నీ ' బి-డబ్స్'..ఈ రెండింటి పక్కనే వినీల యడవల్లి కేక్ స్టూడియో…ఇదీ అంతే ఫేమస్ అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.