అనుష్క ‘చెఫ్’ షెట్టి

చాలా కాలం అయిపోయింది అనుష్క ను తెర మీద చూసి. యువి సంస్థ నిర్మించే సినిమా అంటూ వార్తల్లో వినిపిస్తూంది కానీ సెట్ మీదకు వెళ్లడం కనిపించడం లేదు.  Advertisement నవీన్ పోలిశెట్టి హీరో.…

చాలా కాలం అయిపోయింది అనుష్క ను తెర మీద చూసి. యువి సంస్థ నిర్మించే సినిమా అంటూ వార్తల్లో వినిపిస్తూంది కానీ సెట్ మీదకు వెళ్లడం కనిపించడం లేదు. 

నవీన్ పోలిశెట్టి హీరో. ఇటీవల వచ్చిన స్వాతిముత్యం టైపు కథ అని టాక్ వుంది. అయితే నవీన్ పోలిశెట్టి..అనుష్క కాబట్టి ఆ బజ్ వేరు. ఆ ఇంట్రస్ట్ వేరు. కానీ ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏ అప్ డేట్ లేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా యువి సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి ని ప్రెజెంట్ చేసారు. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందని యూనిట్ వర్గాల బోగట్టా.

ఫన్ విత్ ఎమోషన్ కలగలిపిన ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తున్నారు.