సెట్ మీదకు త్రివిక్రమ్..సుకుమార్ సినిమాలు

ఎన్టీఆర్, బన్నీ, మహేష్, ఇలా పెద్ద హీరోల సినిమాలు స్టార్ట్ కాకుండా వుండడంతో ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల షూట్ లు జరుగుతున్నా, వెలితిగానే వుంది. త్వరలో ఈ ముగ్గురూ కూడా సెట్ మీదకు వెళ్లబోతున్నారు. …

ఎన్టీఆర్, బన్నీ, మహేష్, ఇలా పెద్ద హీరోల సినిమాలు స్టార్ట్ కాకుండా వుండడంతో ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల షూట్ లు జరుగుతున్నా, వెలితిగానే వుంది. త్వరలో ఈ ముగ్గురూ కూడా సెట్ మీదకు వెళ్లబోతున్నారు. 

జర్మనీ వెళ్లి, మహేష్ బాబుతో అన్నీ డిస్కస్ చేసి తిరిగి వచ్చారు దర్శకుడు త్రివిక్రమ్. స్క్రిప్ట్ లాక్ కావడంతో చిన్న చిన్న కరెక్షన్లు చేసి, డైలాగ్ వెర్షన్ కు వెళ్లిపోతున్నారు. జూలై నెల నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. మహేష్ ప్రస్తుతం జర్మనీలోని రిమోట్ విలేజ్ లో వున్నారు. అక్కడి నుంచి రాగానే షెడ్యూలు వర్క్ స్టార్ట్ అవుతుంది.

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో చేయాల్సిన పుష్ప 2 సినిమాకు కూడా రంగం సిద్దం అవుతోంది. ఆగస్ట్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ముందుగా హైదరాబాద్ లో ఓ షెడ్యూలు చేసే అవకాశం వుంది. ఆ తరువాత అవుట్ డోర్ కు వెళ్తారు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ ట్యూన్ ల పని మీద వున్నారు. సుకుమార్ స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ – కొరటాల సినిమా సంగతి ఇంకా అనిశ్చితంగానే వుంది. సెట్ మీదకు ఎప్పుడు వెళ్తారన్న వార్తలు వినిపించడం లేదు. ఎన్టీఆర్ ఖాళీగా వుండే రకం కాదు. కానీ ఎందుకు డిలే చేస్తున్నారన్నది తెలియాల్సి వుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడమే కారణంగా తెలుస్తోంది.