ఫిబ్రవరి 10…’ఉగ్రం’

సినిమాలు అన్నీ చకచకా రెడీ అవుతున్నాయి. డేట్ లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్ పుల్ అయిపోయింది. ఫిబ్రవరి నెల రిలీజ్ డైరీ కూడా ఫుల్ అయిపోతోంది.  Advertisement ఇలాంటి…

సినిమాలు అన్నీ చకచకా రెడీ అవుతున్నాయి. డేట్ లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్ పుల్ అయిపోయింది. ఫిబ్రవరి నెల రిలీజ్ డైరీ కూడా ఫుల్ అయిపోతోంది. 

ఇలాంటి నేపథ్యంలో అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా ఉగ్రం కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాంది సినిమా తరువాత మళ్లీ అదే దర్శకుడు విజయ్ కనకమేడల..అదే హీరో అల్లరి నరేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మజిలీ, కృష్ణార్జున యుద్దం, టక్ జగదీష్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి నిర్మాత. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాంది తరువాత మళ్లీ మరో డిఫరెంట్ క్యారెక్టర్ అది కూడా ఫుల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ను చేస్తున్నాడు అల్లరి నరేష్.

నాంది తరువాత విజయ్ వేరే హీరోలతో వెళ్లడానికి ట్రయ్ చేసాడు కానీ డేట్ లు ఎవ్వరివీ సెట్ కాలేదు. ఇలాంటి టైమ్ లో తన దగ్గర వున్న డిఫరెంట్ స్టోరీని నరేష్ కు నెరేట్ చేయడం, వెంటనే చేసేద్దాం అనడం, సెట్ కు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. 60శాతానికి పైగా షూటింగ్ కూడా జరిగిపోయింది. సంక్రాంతి వేళకు కాపీ రెడీ చేసి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.