కరోనా మహమ్మారి టాలీవుడ్ నిర్మాతను బలి తీసుకుంది. ఏదైతే జరకూడదని అందరూ ఆశించారో…అదే జరిగింది.
కరోనా మహమ్మారి బారిన పడి టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు (64) శనివారం అనంతలోకాలకు వెళ్లాడు. దీంతో సినీ ప్రపంచం భయంతో వణికిపోతోంది.
లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా విజృంభిస్తోంది. దాని ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ప్రమాదంలో ఏ రూపంలో ముంచుకొస్తుందో బిక్కుబిక్కుమంటూ షూటింగ్‌లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబురావు సోదరుడు రామారావు కరోనాకు గురయ్యాడు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ కాంటినెంటల్ దవాఖానలో చికిత్స నిమిత్తం చేర్చారు.
చికిత్స తీసుకున్నప్పటికీ మహమ్మారిపై పోరాటంలో ఆయన పరాజయం పాలయ్యాడు. దీంతో భౌతికంగా ఆయన దూరమయ్యాడు. ఆయన మరణం చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
ఈతరం ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించేవారు.