ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రాంగ్ పర్సన్ ఇన్ టాలీవుడ్ అనుకోవాలి. అస్సలు మొహమాట పడడు. మాట విసరడంలో ఒక్క సెకెండ్ ఆలోచించడు. ఈ వైఖరి టాలీవుడ్ లో తరతరాలుగా అలవాటై పోయిన వ్యవహారాలకు ఇది సింక్ అయ్యేది కాదు.
అలాంటి డైరక్టర్ వున్నట్లుండి…సింపుల్ గా ఒకే ఒక్క మాట ట్వీట్ చేసారు. ''చీప్ స్టార్'' అన్నది ఆ వర్డ్. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరు అయి వుంటారు? అన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి.
సహజంగానే హీరో రవితేజనా? అన్న అనుమానాలు, గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం అజయ్ భూపతి చేయాల్సింది రవితేజతోనే. కొంతకాలంగా ఈ ప్రాజెక్టు నలుగుతూ వస్తోంది. ఇప్పుడు క్యాన్సిల్ అన్న గ్యాసిప్ కూడా బయటకు వచ్చింది.
మహాసముద్రం అనే కథ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. రవితేజ చేద్దాం అనుకున్నారు. కానీ కరెక్షన్లు చెప్పడం జరిగాయని టాక్. కానీ ఎంతకీ ఓకె చెప్పలేదని, సినిమా క్యాన్సిల్ అయిందని కూడా వార్తలు వినిపించాయి. ఎందుకు? ఏమిటి? అన్నది తెలియదు.
ఈ నేపథ్యంలో అజయ్ భూపతి అదే స్క్రిప్ట్ తో నాగ్ చైతన్య దగ్గరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
మహాసముద్రం లైన్ హీరోయిన్ సమంతకు నచ్చినట్లు బోగట్టా. మరి ఈ లోగా ఈ ట్వీట్ ఏమిటో? అన్నదే తెలియడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే నిన్ననే అయింది. అభినందిస్తూ అజయ్ భూపతి ట్వీట్ వేసారు కూడా. మరి వున్నట్లుండి ఉరుము లేని పిడుగులా ఈ కోత్త ట్వీటు అస్త్రం ఎవరిమీద సంధించినట్లో? ఏమిటో?