పవన్ పుట్టిన రోజు పేరుతో జనసేన రచ్చ

తమ ఉనికి కోసం ప్రతిపక్షాలు ప్రతి విషయాన్నీ రాద్ధాంతం చేయాలని చూస్తుంటాయి. అవకాశం లేకపోయినా సృష్టించుకుని మరీ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ జాడ్యం జనసేనకు కూడా అంటుకుంది. Advertisement వాస్తవానికి పవన్ కల్యాణ్…

తమ ఉనికి కోసం ప్రతిపక్షాలు ప్రతి విషయాన్నీ రాద్ధాంతం చేయాలని చూస్తుంటాయి. అవకాశం లేకపోయినా సృష్టించుకుని మరీ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ జాడ్యం జనసేనకు కూడా అంటుకుంది.

వాస్తవానికి పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనలో గొడవలు జరుగుతాయని, వాటిని సాకుగా చూపి వైసీపీపై నిందలేస్తారని వార్తలు వినిపించాయి. పవన్ పర్యటనలో అలాంటివి జరగలేదు కానీ, పవన్ పుట్టినరోజుని మాత్రం జనసైనికులు గొడవల కోసం బాగానే వాడుకున్నారు. 

జనసేనాని బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో కాలేజీల దగ్గర హంగామా చేయడానికి ప్రయత్నించి అరెస్ట్ ల వరకూ వెళ్లారు జనసైనికులు. పశ్చిమ గోదావరిలోని శశి కాలేజీ వివాదం సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపిందో చూశాం.

కాలేజీ డైరెక్టర్ కేక్ పక్కకు తోసేశాడని విద్యార్థులు ఆందోళనకు దిగి, రాస్తారోకో చేశారు. కాలేజీ ముందు అసాంఘిక శక్తులు బర్త్ డే పేరుతో అల్లరి చేయడానికి చూశాయని, అదే సమయంలో సెలవలకు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లడానికి పేరెంట్స్ వస్తున్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకునే పుట్టినరోజు వేడుకలను అడ్డుకోవాల్సి వచ్చిందని సదరు డైరెక్టర్ వివరణ ఇచ్చారు. అయినా కూడా ఆందోళనలు ఆగలేదు. 

ఇక అదే జిల్లాలో మరో కాలేజీ ముందు బర్త్ డే జోష్ ని పోలీసులు అడ్డుకున్నారు. కాలేజీ క్యాంపస్ ముందు అల్లరి చేస్తున్నారని కొంతమందిని తీసుకొచ్చి లాకప్ లో పెట్టారు. ఇక జనసేన విద్యార్థి విభాగం రాస్తారోకో, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా.. వగైరా, వగైరాతో హడావిడి చేసింది.

మొత్తమ్మీద రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోడానికి జనసైనికులు ఇలా ఆందోళనలు సృష్టించడం కొత్తగానే కనిపిస్తోంది.  సింపతీ కోసం పవన్ కల్యాణ్ ఇలాంటి చర్యల్ని కూడా ప్రోత్సహిస్తారా అని జాలేస్తోంది. 

పుట్టినరోజు వేడుకల్ని ఎవరూ వద్దని చెప్పరు, కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేయాలనుకుంటే ఎవరూ అడ్డుకోరు. కానీ ఆ పేరుతో అలజడి సృష్టించి సామాన్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకు పోతుంది.

పవన్ ప్రతి పుట్టినరోజుకు కాస్తోకూస్తో హంగామా కామన్. కానీ ఈసారి ఆ హంగామా బాగా శృతిమించింది. ఒకదశలో పవన్ గెలవలేదనే ఫ్రస్ట్రేషన్ ను ఫ్యాన్స్ ఇలా అతి హంగామాతో చూపిస్తున్నారేమో అనిపిస్తోంది.