బాలకృష్ణకు మళ్లీ అదే హీరోయిన్!

ఇప్పుడా.. ఎప్పుడో దశాబ్దం కిందటి సంచలనం సోనాల్ చౌహాన్. 'జన్నత్' సినిమాతో ఆమె గుర్తింపును సంపాదించుకుంది. అయితే హిందీ జనాలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు రెండో సినిమాకు తెలుగు అవకాశం వచ్చింది.…

ఇప్పుడా.. ఎప్పుడో దశాబ్దం కిందటి సంచలనం సోనాల్ చౌహాన్. 'జన్నత్' సినిమాతో ఆమె గుర్తింపును సంపాదించుకుంది. అయితే హిందీ జనాలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు రెండో సినిమాకు తెలుగు అవకాశం వచ్చింది. 'రెయిన్ బో' అనే సినిమాలో నటించింది. 

ఆ తర్వాత తెలుగులో  కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొంత విరామం అనంతరం బాలకృష్ణ సినిమా 'లెజెండ్'లో అవకాశం లభించింది. అప్పటి నుంచి బాలకృష్ణ సినిమాలే ఆమెను ఆదుకుంటున్నాయి.
బాలకృష్ణకు తగిన హీరోయిన్లను తేవడం దర్శకులకు, నిర్మాతలకు కష్టం అయిపోతున్నట్టుగా ఉంది. అందుకే హీరోయిన్ల రిపీట్ చేయడం తప్పడం లేదు.

అందులో భాగంగా మరోసారి ఛాన్స్ సోనాల్ చౌహాన్ కు దక్కినట్టుగా ఉంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో సోనాల్ చౌహాన్ తో ఆ హీరో స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. తద్వారా మరోసారి  బాలయ్యతో ఆమె జతకడుతోందనే స్పష్టత వచ్చింది. డిక్టేటర్ లో కూడా ఈమె బాలయ్యతో నటించిన సంగతి తెలిసిందే.