సినిమాపై ఏకధాటిలో తొలి రోజు నుంచినే నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు. నెగిటివ్ టాక్ ను పంపిణీ చేసిన వారిలో ఎంతమంది ఆ సినిమాను చూసి అలా పబ్లిసిటీ చేశారో చెప్పలేం. 'సాహో'కు శత్రువులు చాలా మంది కనిపించారు. వారంతా మూకుమ్మడిగా సినిమాపై నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడంలో తొలి రోజు ఫుల్ బిజీగా కనిపించారు.
ఆ ప్రభావం సినిమాపై గట్టిగానే ఉంటుంది. అయితే ఈ సినిమాకు అటు వీకెండ్ తో పాటు ఒక రోజు అదనంగా కలిసి వచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించవచ్చు. శుక్రవారం రొటీన్ ఓపెనింగ్స్ కు తోడు శని, ఆది వారాలు టాక్ తో నిమిత్తం లేకుండా సినిమా చూసే వాళ్లు సహజంగానే ఉంటారు.
ఇక సోమవారం కూడా సెలవుదినం కావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు లభించే అవకాశాలున్నాయి. మామూలుగా అయితే ఈ సినిమా వచ్చిన స్ప్రెడ్ అయిన నెగిటివ్ టాక్ తో సోమవారానికి కలెక్షన్లు డల్ కావాలి. అయితే పండగను సినిమాతో సెలబ్రేట్ చేసుకునే తత్వం తెలుగువారిది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున సాహోకు మంచి కలెక్షన్లు లభించడం ఖాయమే. ఇలా ఒక రోజు కలిసి వచ్చింది. సెలవు దినం అంటే ఇలాంటి సినిమాలకు కోట్ల రూపాయల వసూళ్లను తెచ్చి పెట్టే రోజు. ఇలా వినాయకచవితి 'సాహో'కు కలిసి వచ్చింది.