బాలీవుడ్ వార్ సినిమా దర్శకుడు అనగానే గుర్తుకు వచ్చే పేరు సిద్దార్ధ్ ఆనంద్. ఇప్పుడు అతగాడి గురించి గట్టిగా వినిపిస్తోంది టాలీవుడ్ లో కూడా. ఎందుకంటే హీరో ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు కనుక. దీనికి నిర్మాణం మైత్రీ మూవీస్ సంస్థ. తెలుగు వెర్షన్ పంపిణీ హక్కులు యువి తీసుకునేలా ఒప్పందాలు ఏవో వున్నాయి మొత్తానికి.
ఇక్కడ విషయం ఏమిటంటే సిద్దార్థ్ ఆనంద్ రెమ్యూనిరేషన్ నే 80 కోట్లు అని వినిపిస్తోంది. ఇందులో ఇప్పటికే 20-30 కోట్ల మధ్యలో అడ్వాన్స్ ల రూపంలో వెళ్లిపోయిందట. అంటే సినిమా ప్రారంభం కాకుండానే నిర్మాతలు నెల నెలా ఎంత వడ్డీ కడుతున్నట్లు?
ఇదే ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ కు 20 కోట్లకు కాస్త అటు ఇటుగా అడ్వాన్స్ ఇచ్చి ఏళ్లు దాటుతోంది. మరి దానికి వడ్డీల సంగతి? మన తెలుగు దర్శకులే ముఫై కోట్లు వరకు తీసుకుంటుంటే సిద్దార్ధ్ ఈమాత్రం తీసుకోవడం ఫరవాలేదు అనుకోవాల్సిందే
ఇదిలా వుంటే సల్మాన్ ఖాన్ తో మైత్రీకి ఒప్పందం వుంది. అందుకోసం సల్మాన్ కు 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసి ఏళ్లు దాటుతోంది. దానికి ఓ డైరక్టర్ ను సెట్ చేసారు. అది మళ్లీ సెట్ కాలేదు. ఇప్పుడు మరో డైరక్టర్ ను సెట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మైత్రీ లాభాలు అన్నీ ఈ వడ్డీలే తినేస్తాయేమో?