ఆ కథ వదులుకున్న గౌతమ్ తిన్ననూరి

అందరూ భారీ సినిమాలే కదా చేస్తున్నారు అని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 2050 తరువాత జరిగే ఓ ఫ్యూచరిస్టిక్ కథను రాసుకున్నాడు.  Advertisement వంద నుంచి రెండు వందల కోట్ల బడ్జెట్ కథ…

అందరూ భారీ సినిమాలే కదా చేస్తున్నారు అని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 2050 తరువాత జరిగే ఓ ఫ్యూచరిస్టిక్ కథను రాసుకున్నాడు. 

వంద నుంచి రెండు వందల కోట్ల బడ్జెట్ కథ అది. కానీ దానికి మెగాస్టార్ ఆమోదం పడలేదు. రామ్ చరణ్ కూడా అంత సుముఖంగా లేడు. దాంతో ఆ కథను అక్కడి నుంచి దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ తో చేయాలని ఆలోచన. కానీ ఎందుకో దిల్ రాజు కూడా ముందు వెనుక ఆడినట్లు తెలుస్తోంది.

దీంతో గౌతమ్ తిన్ననూరి ఆ కథను తన బీరువాలో పెట్టేసి, మళ్లీ గతంలో మాదిరిగా ఓ మాంచి ఎమోషనల్ కథను వండే పని ప్రారంభించారట. కథ రెడీ అయితే అది ఎవరికి సెట్ అవుతుంది అన్నదానిని బట్టి హీరోను ఎంచుకుంటాడట. ఈ సినిమా తిరిగి తిరిగి మళ్లీ తన జెర్సీ బ్యానర్ సితారలోనే చేస్తాడని బోగట్టా.

మరి ఇంతకీ ఈసారి గౌతమ్ తిన్ననూరి మీడియం రేంజ్ కథకు ఎవరు సెట్ అవుతారో చూడాలి. చైతన్య, విజయ్ దేవరకొండ ఇలా జాబితా చాలానే వుంది మరి.