అఖండ విజయం ముందు బాలయ్య వేరు. తరువాత బాలయ్య క్రేజ్ వేరు. మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ తేడా నాలుగు కోట్ల కింద లెక్కయినట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే వీరసింహారెడ్డి సినిమా కోసం బాలయ్య రెమ్యూనిరేషన్ 8 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈలోగా అఖండ బ్లాక్ బస్టర్ అయింది. బాలయ్య క్రేజ్ మామూలుగా పెరగలేదు. దాంతో ఇప్పుడు తన రెమ్యూనిరేషన్ ను బాలయ్య రివైజ్ చేసినట్లు తెలుస్తోంది. 12 కోట్ల మేరకు ఫిక్స్ చేసినట్లు బోగట్టా.
గమ్తత్తేమిటంటే అంతకు ముందే అనిల్ రావిపూడి సినిమా కూడా ఒప్పుకున్నారు బాలయ్య. దానికి రెమ్యూనిరేషన్ 12 కోట్లు. ఇప్పుడు అది కూడా రివైజ్ అవుతుంది. కానీ ఇప్పుడంటే ఇప్పుడే కాదు. సినిమా స్టార్ట్ కావాలి, పూర్తి కావాలి. అప్పటి పరిస్థితిని బట్టి వుంటుంది వ్యవహారం.
కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సీనియర్ హీరోలు నలుగురిలో ఇప్పుడు బాలకృష్ణకే మంచి లైనప్ వుంది. మంచి మార్కెట్ వుంది. క్రేజ్ వుంది. కానీ ఆయనేమీ నలభై కోట్లు, యాభై కోట్లు డిమాండ్ చేయడం లేదు. నాగ్..వెంకీ కూడా ఇంకా ఎనిమిది కోట్ల రేంజ్ లోనే వున్నారు. ఒక్క మెగాస్టార్ మాత్రమే 40 నుంచి 50 ల రేంజ్ లో వున్నారు.