ఆ సినిమా లేనట్లేనా?

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మాంచి కమర్షియల్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. కానీ ఆ తరువాత సినిమా మాత్రం అంత సులువుగా పట్టాలు ఎక్కడం లేదు. అదిగో బ్యానర్, ఇదిగో బ్యానర్ అంటూ…

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మాంచి కమర్షియల్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. కానీ ఆ తరువాత సినిమా మాత్రం అంత సులువుగా పట్టాలు ఎక్కడం లేదు. అదిగో బ్యానర్, ఇదిగో బ్యానర్ అంటూ పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి. అలాగే హీరోల పేర్లు కూడా.

సినిమా పేరు మహా సముద్రం అని కూడా బయటకు వచ్చింది. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదే తెలియదు. ఆఖరికి హీరో రవితేజతో ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, డిస్కోరాజా తరువాత అదే అని వార్తలు వచ్చాయి. 

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ లో మరో గ్యాసిప్ గుప్పు మంది. రవితేజ-అజయ్ భూపతి సినిమా క్యాన్సిల్ అయిందన్నదే ఆ గ్యాసిప్ ల సారాంశం.

పూర్తి వివరాలు తెలియడం లేదు కానీ రవితేజ అయితే ఆ సినిమా చేయడం లేదని, ఆ సినిమా ప్లేస్ లో గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని చేసే రవితేజ సినిమాకు క్రాక్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. రవితేజతో సినిమా ఎంటర్ టైన్ మెంట్ పండించగల డైరక్టర్ గోపీచంద్ మలినేని. క్రాక్ అనే టైటిల్ అంత వరకు బాగానే వుంది.కానీ ఎమోషనల్ డైలాగులు, ఫీల్ గుడ్ సంభాషణలు అద్భుతంగా రాసే బుర్రా సాయి మాధవ్ ను రైటర్ గా పెట్టుకున్నారు.

బుర్రా సంభాషణల రచయితగా సూపర్. కానీ కామెడీ జోనర్ లో మాత్రం కాదని గతంలో అతని సినిమాలు రుజువు చేసాయి. మరి 'క్రాక్' అనే సినిమాకు బుర్రా ఏ మేరకు న్యాయం చేస్తారో చూడాలి.