ఖుషీ..మళ్లీ మరోసారి వాయిదా!

విజయ్ దేవరకొండ సినిమాలు మైత్రీ మూవీస్ కు అచ్చి వస్తున్నట్లు లేదు. డియర్ కామ్రేడ్ చేసారు. పరమ డిజాస్టర్ అయింది. హీరో అనే సినిమా స్టార్ట్ చేసారు. ట్రయినింగ్..ఖర్చులు..ఢిల్లీలో రేస్ ట్రాక్ మీద ట్రయినింగ్…

విజయ్ దేవరకొండ సినిమాలు మైత్రీ మూవీస్ కు అచ్చి వస్తున్నట్లు లేదు. డియర్ కామ్రేడ్ చేసారు. పరమ డిజాస్టర్ అయింది. హీరో అనే సినిమా స్టార్ట్ చేసారు. ట్రయినింగ్..ఖర్చులు..ఢిల్లీలో రేస్ ట్రాక్ మీద ట్రయినింగ్ అంటూ కోట్లు ఖర్చు చేసారు. 

సినిమా ఆగిపోయింది. దానికి కాపన్ సేషన్ అన్నట్లుగా సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషీ సినిమా ప్రారంభించారు. చకచకా షూటింగ్ సగం వరకు జరిగిపోయింది. డిసెంబర్ లో విడుదల అనుకున్నారు.

మళ్లీ బ్యాడ్ లక్ పలకరించింది. సమంతకు ఆరోగ్యం బాగా లేదు. దాంతో డిసెంబర్ డేట్ ను ఫిబ్రవరి 10 కి మార్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ డేట్ కు కూడా ఖుషీ రావడం లేదు. సమ్మర్ కు మారుస్తున్నారు. సమంత ఆరోగ్యం సరిగ్గా లేనందున విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్ల నవంబర్ లో కూడా షూట్ కు రాలేనని చెప్పేసినట్లు తెలుస్తోంది.

దాంతో డిసెంబర్, జనవరి రెండు నెలల్లో వర్క్ పూర్తి కాదు కనుక, ఫిబ్రవరి 10 డేట్ వదిలేసి సమ్మర్ కు సినిమాను వాయిదా వేసేస్తున్నారు. ఈ సినిమా ఇలా వుండగానే మరో సినిమా ఏదైనా సెట్ మీదకు తీసుకెళ్లడానికి విజయ్ వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గీతా, దిల్ రాజు, సితార ఇలా చాలా బ్యానర్ల పేర్లు వినిపిస్తున్నాయి.