మొత్తానికి ఎప్పుడో చెప్పినట్లే అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా దసరా బరిలోకి దిగడం లేదు. అలా అని మళ్లీ ఎప్పుడు విడుదల అన్నది చెప్పడం లేదు. వీలయినంత త్వరలో…కానీ..ప్రపంచ సినిమా మార్కెట్ అంతా ఓపెన్ అయిన తరువాత..అదీ సజావుగా నడుస్తున్న తరుణంలో అన్నది వివరణ.
ప్రస్తుతం ప్రపంచ సినిమా మార్కెట్ అంతా ఓ మాదిరిగా లేదు. ఒక్కోదగ్గర ఒక్కో సమస్య. ఆర్ఆర్ఆర్ కు వరల్డ్ వైడ్ మార్కెట్ వుంది. అందుకే ప్రపంచ థియేటర్ వ్యవస్థ అంతా సర్దుకున్నాక కానీ డేట్ అనౌన్స్ మెంట్ వుండదు.
ఇప్పటికే సంక్రాంతి బరిలోకి దిగుతున్నాం అని జనవరి విడుదల సినిమాల నిర్మాతలకు దానయ్య, రాజమౌళి కొడుకు కార్తికేయ సమాచారం అందించారు. మరి ఆ మాట మీద అయినా వుంటారా? అన్నది అనుమానంగానే వుంది.
థర్డ్ వేవ్ అనేది లేకపోతే జనవరి నాటికి వరల్డ్ థియేటర్ వ్యవస్థ కుదుట పడుతుంది. లేదూ అంటే ఆర్ఆర్ఆర్ నుంచి మరో డేట్ రావడానికి చాలా అంటే చాలా టైమ్ పడుతుంది.