సర్కారు వారి పాట ఆరంభం…ముగింపు..ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద మహేష్ ప్రేమ..అలక. అవును నిజమే.
సర్కారు వారి పాటకు థమన్ చేసిన వర్క్ పట్ల మహేష్ బాబు పూర్తిగా అసంతృప్తిగా వున్నారు. కళావతి, పెన్నీ పెన్నీ లాంటి హిట్ సాంగ్ లు ఇచ్చినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మైనస్ మార్కులు పడిపోయాయి.
సర్కారు వారి పాట కర్నూలు విజయోత్సవం జరిగిన రోజే మహేష్ తన అసంతృప్తిని థమన్ ముందు బాహాటంగా వ్యక్తం చేసారు. అదే టైమ్ లో అక్కడ వున్న దర్శకుడు పరుశురామ్ మీద కూడా సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకోవడం రాలేదన్న అసంతృప్తిని కూడా వ్యక్తం చేసారు.
ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా థమన్ వర్క్ మీద అసంతృప్తిగానే వున్నారు. మొన్నటికి మొన్న త్రివిక్రమ్ తో పాటు జర్మనీకి థమన్ కూడా వెళ్లాల్సిందే. లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యాడు. ఇలా డ్రాప్ కావడం వెనుక కారణం కూడా సర్కారు వారి పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వైఫల్యం మహేష్ ను వెంటాడుతుండడమే అని తెలుస్తోంది.
సరే,సర్కారు వారి పాట వ్యవహారం ముగిసింది. త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా వర్క్ స్టార్ట్ కాబోతోంది. మర థమన్ ను వుంచుతారా? రీప్లేస్ చేస్తారా? అన్న క్వశ్చను వినిపిస్తోంది. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం థమన్ నే కొనసాగించబోతున్నారు.
సర్కారు వారి పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పూర్తి వైఫల్యం థమన్ మీదకే నెట్టేయడం సరి కాదని కూడా వినిపిస్తోంది. అక్కడ పరుశురామ్ కు చాతకాకపోయి వుండొచ్చు.
కానీ ఇక్కడ వున్నది త్రివిక్రమ్. అందువల్ల పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో థమన్ కచ్చితంగా మార్కులు కొట్టేస్తాడు. పైగా థమన్ ను మార్చాలన్నా ఆల్టర్ నేటివ్ సరైనది లేదు. అందువల్ల మళ్లీ థమన్ తన తప్పు సరిదిద్దుకునే ఛాన్స్ కచ్చితంగా వుంటుంది.