గొంతులో కాషాయం….మాటలో ఆవేశం….

జెండాలు వేరు కానీ మాట మాత్రం ఒక్కటే. అజెండా కూడా ఒక్కటే. మొదట బీజేపీ స్టార్ట్ చేస్తుంది. ఆ మీదట తెలుగుదేశం ఫాలో ఫాలో అంటుంది. ఇది ఏపీలో రెండేళ్ళుగా సాగుతున్న వైనమే. Advertisement…

జెండాలు వేరు కానీ మాట మాత్రం ఒక్కటే. అజెండా కూడా ఒక్కటే. మొదట బీజేపీ స్టార్ట్ చేస్తుంది. ఆ మీదట తెలుగుదేశం ఫాలో ఫాలో అంటుంది. ఇది ఏపీలో రెండేళ్ళుగా సాగుతున్న వైనమే.

దేవుళ్ళు, హిందూ కార్డు మీద పూర్తి పేటెంట్ హక్కులు బీజేపీకే ఉన్నాయన్నది తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి పోటీ పేచీ లేదు. కానీ ఏపీలో మాత్రం ఏకంగా తెలుగుదేశంతోనే గట్టి  పోటీ ఎదురువస్తోంది.

ఏపీలో బీజేపీ నేతలు హిందూ మతం అంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే వారి సౌండ్ మెల్లగా తగ్గిపోతోంది. ఎందుకంటే దాన్ని హైజాక్ చేసేశారు తమ్ముళ్ళు. ఇపుడు టీడీపీ నేతలు తెగ‌ బాధపడుతున్నారు. 

ఏపీలో హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లిందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు లాంటి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందని  ఆరోపిస్తున్నారు.

నిజానికి ఈ డైలాగులు వారివి కావు, ఆ ఆవేశం వారిది కాదు, కానీ తప్పదు, హిందూ కార్డు మీద బీజేపీ ఏపీలో బలపడితే తమకు పోటీగా తయారైతే అన్నదే వారి  బాధ ఉంది. అందుకే ఎలాంటి జంకూ గొంకూ లేకుండా బీజేపీ అజెండాను అందిపుచ్చుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి. అందుకే తమ్ముళ్ళో గొంతులో కాషాయం, మాటలో ఆవేశం అలా అలవోకగా పలికేస్తోందని కూడా  అంటున్నారు.