చిరు..రవితేజ..మధ్యలో ఊర్వశి

మెగా సినిమా వాల్తేర్ వీరయ్య పక్కన ఐటమ్ చిందులు వేసేసింది ఊర్వశి రౌతాలా. ఇదే పాటలో మాస్ హీరో రవితేజ కూడా స్టెప్ లు వేసారు. ఇటీవలే ఊర్వశి రౌతాలా హీరో రామ్ సరసన…

మెగా సినిమా వాల్తేర్ వీరయ్య పక్కన ఐటమ్ చిందులు వేసేసింది ఊర్వశి రౌతాలా. ఇదే పాటలో మాస్ హీరో రవితేజ కూడా స్టెప్ లు వేసారు. ఇటీవలే ఊర్వశి రౌతాలా హీరో రామ్ సరసన డైరక్టర్ బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతాలా నే వాల్తేర్ వీరయ్య లో కూడా చేయడం విశేషం. 

వాల్తేర్ వీరయ్య సినిమా వర్క్ ను చకచకా పూర్తి చేయాల్సి వుంది. అందుకే ఇక్కడే రెడీ గా వున్న ఊర్వశి తో పాటను ఫినిష్ చేసేసారు. మరో ఆప్షన్ కూడా ఆలోచించలేదు.

ఇదిలా వుంటే ఈ పాట కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఓపెన్ సెట్ వేసారు. ఈ పాట కోసం ఏకంగా డజన్ క్రేన్ లు తెప్పించిన వైనాన్ని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అప్పటికప్పుడు డజను క్రేన్ లు వాడి పాటను పిక్చరైజ్ చేసారని టాక్.

దేవీశ్రీప్రసాద్ ఐటమ్ సాంగ్ ట్యూన్ లు అంటే ఓ క్రేజ్ వుంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ట్యూన్ ఇచ్చారన్నది చూడాలి. ఇప్పటికైతే వినవస్తున్న టాక్ ప్రకారం కొత్త తరహా ట్యూన్ ఇచ్చాడని వినగా వినగా జనాలకు చేరువ అవుతుందని తెలుస్తోంది.