అధికారంలో ఉన్నపుడు చేసినవి, జరిగినవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకు రావో, లేక కన్వీనియెంట్ గా మరచిపోతారో కానీ విపక్షంలోకి వచ్చాక పెద్ద నోరు అవుతుంది. లాజిక్ మిస్ అయినా పరవాలేదు, తిడితే చాలు అనుకుంటారేమో
చూడబోతే తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఇదే రూట్లో పయనిస్తున్నారనిపిస్తోంది. ఆమె ఉన్నట్లుండి హఠాత్తుగా విశాఖకు శని పట్టేసింది అంటూ పెద్ద మాటలు వాడేశారు. విశాఖలో వరసగా పరిశ్రమలలో ప్రమాదాలు జరుగుతున్నాయట. నిన్న ఎల్జీ పాలిమార్స్ లో గాస్ లీకేజ్ అయితే నేడు ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజ్ అయింది. ఇలా పరిశ్రమలు ప్రమాదంలో పడడానికి కారణం వైసీపీ సర్కార్ అంటూ ఆడిపోసుకుంటున్నారు.
అందువల్ల విశాఖకు పెద్ద శనే పటిందని ఆమె తీర్మానించేశారు. సరే విపక్ష నేతగా ఆమె ఆరోపణలు చేయవచ్చు కానీ ఒకటో రెండో ప్రమాదాలు జరిగితే ఏకంగా విశాఖకు దాని చుట్టేసి శని అనడంపైనే మేధావులు, అభువ్రుధ్ధికాముకులు గుస్సా అవుతున్నారు.
సరే పరిశ్రమలూ, ప్రమాదాల వల్లనే విశాఖ శని అయినట్లైతే చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ళు పాలించిన కాలంలో ఏకంగా పదుల సంఖ్యలో హెచ్ పీ సీఎల్ గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయారు. ఇక ఇదే ఎల్జీ పాలిమర్స్ లో అనేకసార్లు గ్యాస్ లీకేజి వంటి ప్రమాదాలు జరిగాయి. అనేక ఇతర పరిశ్రమల్లో జరిగాయి
మరి పారిశ్రామిక నగరంగా విశాఖ ఉంది, అభివ్రుధ్ధి మాటునే ప్రమాదమూ ఉంది. దానికి చట్టాలు, గత పాలకుల దుర్నీతి అన్నీ కారణాలుగా ఉన్నాయి. కానీ కేవలం ఇవన్నీ వైసీపీ సర్కార్ పాపమే అనేస్తే సరిపోతుందా అనితమ్మా అంటున్నారు వైసీపీ నేతలు.