లాక్ డౌన్ లో హీరోయిన్ క్రియేటివిటీ

ఈ లాక్ డౌన్ టైమ్ ను హీరోయిన్లంతా తమకు నచ్చినట్టు వాడుకున్నారు. కొందరు గ్లామర్ కు ప్రాధాన్యం ఇస్తే, ఎక్కువమంది టీవీలకు అతుక్కుపోయారు. హీరోయిన్ అదితిరావు మాత్రం ఈ 3 నెలల లాక్ డౌన్…

ఈ లాక్ డౌన్ టైమ్ ను హీరోయిన్లంతా తమకు నచ్చినట్టు వాడుకున్నారు. కొందరు గ్లామర్ కు ప్రాధాన్యం ఇస్తే, ఎక్కువమంది టీవీలకు అతుక్కుపోయారు. హీరోయిన్ అదితిరావు మాత్రం ఈ 3 నెలల లాక్ డౌన్ టైమ్ ను తన క్రియేటివిటీ కోసం వాడుకున్నట్టు తెలిపింది

“గడిచిన 8-9 ఏళ్లుగా నాకు ఎంతో ఇష్టమైన డాన్స్, మ్యూజిక్ కు సమయం కేటాయించలేకపోయాను. గతంలో కళారీ (కేరళకు చెందిన ఓ ప్రాచీన యుద్ధనీతి) నేర్చుకొని మధ్యలోనే ఆపేశాను. అలాంటి క్రియేటివ్ వర్క్ తో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఈ బ్రేక్ బాగా పనికొచ్చింది.”

ఈ లాక్ డౌన్ టైమ్ లో అందర్లానే తను కూడా ఒత్తిడికి లోనయ్యానని, షూటింగ్స్ మిస్సయ్యానని చెబుతున్న అదితి.. తనలానే ఒత్తిడిలో ఉన్న తన స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిపింది. అలా చేయడం వల్ల వాళ్ల ఒత్తిడిని కొంత తగ్గించడంతో పాటు తనకు కూడా ప్రశాంతంగా ఉందని అంటోంది.

ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఉన్న అదితి.. లాక్ డౌన్ టైమ్ కు హైదరాబాద్ చేరుకుంది. తనకిష్టమైన డాన్స్, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడంతో పాటు.. కొత్త కొత్త వంటకాలు ట్రై చేసింది. బెంగాలీ మస్టర్డ్ మటన్ కర్రీ, యక్నీ పులావ్, మిర్చీ కా సాలన్ వంటకాల్ని ఇప్పుడు బ్రహ్మాండంగా చేయగలనంటోంది ఈ ముద్దుగుమ్మ.

బెజవాడలో కనీ వినీ ఎరుగని దృశ్యం

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి