కీర్తి సురేష్ నా…రష్మిక నా?

మిస్ ఇండియా , రంగ్ దే కాకుండా హీరోయిన్ కీర్తి సురేష్ దాదాపు కమిట్ అయిన తెలుగు ప్రాజెక్టులు రెండు వున్నాయి. ఒకటి మహేష్ బాబు-పరుశురామ్ కాంబో సర్కారువారి పాట. రెండు నాగ్ చైతన్య-విక్రమ్…

మిస్ ఇండియా , రంగ్ దే కాకుండా హీరోయిన్ కీర్తి సురేష్ దాదాపు కమిట్ అయిన తెలుగు ప్రాజెక్టులు రెండు వున్నాయి. ఒకటి మహేష్ బాబు-పరుశురామ్ కాంబో సర్కారువారి పాట. రెండు నాగ్ చైతన్య-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే సినిమా.  ఈ రెండు దాదాపు కమిట్ అయినట్లే.

అయితే ఇటీవల బయటకు వచ్చిన కీర్తి ఫోటోలు చూసిన తరువాత నాగ్ చైతన్య సినిమా యూనిట్ మాత్రం డైలామాలో పడినట్లు తెలుస్తోంది. చాలా చిక్కిపోయి, కీర్తి లుక్ బాగా లేదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆమెతోనే ముందుకు వెళ్లాలా? వేరే హీరోయిన్ ను చూడాలా? అన్న ఆలోచనలో విక్రమ్ కుమార్-చైతన్య-దిల్ రాజు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మిక పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక డేట్స్ అవైలబుల్ వున్నాయా? వుంటే ఎప్పుడు వుంటాయి? అన్నది విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్మిక డేట్లు వుండి, ఆమె కనుక ఎస్ అంటే విక్రమ్ కుమార్-చైతన్య ప్రాజెక్టు నుంచి కీర్తి పేరు తప్పిపోతుంది.  వెయిట్ అండ్ సీ..ఏమవుతుందో?

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు