టూర్లో పవన్‌కు అభిమాని కానుక

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శుక్రవారం నాడు అమరావతి ప్రాంత పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ అరుదైన సంఘటన జరిగింది. పవన్ యాత్ర పొడవునా.. ఆయనను చూడడానికని అభిమనులు పెద్దసంఖ్యలో…

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శుక్రవారం నాడు అమరావతి ప్రాంత పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ అరుదైన సంఘటన జరిగింది. పవన్ యాత్ర పొడవునా.. ఆయనను చూడడానికని అభిమనులు పెద్దసంఖ్యలో వెల్లువలా వచ్చారు. దారికిరువైపులా ఉన్న వారికి పవన్ కారులోంచి పైకి లేచి నిలబడి అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు.

ఈ క్రమంలో పవన్ కాన్వాయ్ నిడమర్రు ప్రాంతంలో ఉన్నప్పుడు ఓ అభిమాని కారు వద్దకు ఉరికి వచ్చాడు. కారు సన్ రూఫ్ లోంచి నిల్చుని పవన్ అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఆయనను పట్టుకుని.. తాను తయారుచేసిన ఓ చెప్పుల జతను బహూకరించాడు. ఈ చెప్పులు మీరు వేసుకుంటే చూడాలని ఉందని కోరాడు.

అభిమాని ఎంతో ప్రేమతో ఇచ్చిన కానుకను పవన్ కల్యాణ్ చిరునవ్వుతో స్వీకరించాడు. అంతేకాదు… అక్కడినుంచి తనయాత్ర పొడవునా అవే కొత్త చెప్పులతో నడుస్తూ తిరిగాడు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ఒక గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా.. అభిమాని ఇచ్చిన ఆ చెప్పులనే ధరించడం విశేషం.

హీరో పవన్ కల్యాణ్ సాధారణంగా అంతర్జాతీయ పాదరక్షల బ్రాండ్ అయిన ఫిట్ ఫ్లాప్ చెప్పులను వాడుతుంటారు. ఎలాంటి సమయంలోనైనా ఆయన అదే బ్రాండ్ చెప్పులు ధరిస్తారు. కానీ.. తన అభిమాని ప్రేమతో ఇచ్చిన కానుకను ఆయన కాదనలేకపోయారు. యాత్ర పొడవునా అదే చెప్పులతో తిరగడం విశేషం. మొత్తానికి అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో.. దానికి తగ్గట్టుగానే తాను నడుచుకుంటాను అన్నట్లుగా జనసేనాని నిరూపించడం విశేషం.

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!