పవన్: విలీన భేటీకి కారణం దొరికింది

జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెట్టి, నిశ్చింతగా టెన్షన్ లేని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. పార్టీని విలీనం చేయమంటే నన్ను అడిగారు, అయితే నేను అందుకు మొగ్గు…

జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెట్టి, నిశ్చింతగా టెన్షన్ లేని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. పార్టీని విలీనం చేయమంటే నన్ను అడిగారు, అయితే నేను అందుకు మొగ్గు చూపించలేదు.. అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తద్వారా విలీనం అనే పదానికి పార్టీ నాయకులను శ్రేణులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఆయన మానసికంగా ట్యూన్ చేశారు. పార్టీని విలీనం చేయాలన్నా.. లేదా పొత్తులు అనే ముసుగులో ప్రస్తుతానికి జమిలియాత్ర సాగించాలన్నా ముందస్తుగా ఒకసారి  భారతీయ జనతాపార్టీ సారథులు అమిత్ షా,  నరేంద్రమోడీతో భేటీ కావడం అవసరం. ఆ భేటీ కోసం పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఒకసాకు దొరికింది.

‘జనసేనను భారతీయ జనతా పార్టీలో  కలిపేయడానికి’ అని జరిగిన ప్రచారానికి కారణమైన భేటీఒకటి ఉంది. తానా సభల కోసం అమెరికాకు వెళ్లిన సందర్భంలో, భారతీయ జనతా పార్టీ వ్యూహకర్త రామ్ మాధవ్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ సంగతి విలేకరులు అడిగిన ఒప్పుకోకుండా దాటవేత సమాధానాలు చెప్పారు. ఆ రకంగా భాజపాలో విలీనానికి ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ డీల్ మాట్లాడాల్సి ఉంది. అమరావతి గందరగోళం నేపథ్యంలో.. తాను ఆశించే భేటీ కోసం పవన్ కళ్యాణ్ ఒక కారణాన్ని సృష్టించుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారంనాడు పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆయన అన్నారు. మంత్రులు తమ ప్రకటనలతో రాజధాని విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ రాజధాని వద్దని తాను ఎన్నడూ అనలేదని.. రైతులకు ఇష్టంలేకుండా చేసిన భూసేకరణను మాత్రమే వ్యతిరేకించారని పవన్ చెప్పుకొచ్చారు.

మొత్తానికి, రాజధాని రైతుల ఆవేదనను పట్టించుకునే  అజెండాతో పవన్ కళ్యాణ్ శుక్రవారం సాగించిన పర్యటన, మొక్కుబడిగా- కంటితుడుపుగా సాగింది. పర్యటనకు ముందు అక్కడి రైతుల కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మోడీ తో భేటీ అయి, ఆయన దృష్టికి తీసుకువెళ్తా అని అనడంచూసి ప్రజలు నీరసపడిపోయారు.

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!