ఒకవైపు బీజేపీ వాళ్లేమో ఫ్రీ రేషన్ గురించి గొప్పలు మొదలుపెట్టారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో చావకూడదని మోడీ ఈ పథకాన్ని ప్రకటించారని కేంద్రమంత్రులు వంతపాట మొదలుపెట్టారు. అయితే ఇంత కరోనా కష్టాల్లో, కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయిన స్థితిలో రేషన్ ఇస్తే సరిపోతుందా? అనేది కీలకమైన ప్రశ్న. మోడీ భక్తులేమో.. రేషన్ ఉచితంగా ఇవ్వడాన్ని అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే మోడీ ఇస్తారన్నారు కాబట్టి. ఒకవేళ ఈ ఫ్రీ రేషన్ పథకాన్ని మోడీ అనౌన్స్ చేయకపోయినా భక్తుల దృష్టిలో ఆయన స్థానమేదీ మారదు.
అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలు విడతల వారీగా ఉచిత రేషన్ ఇస్తున్నాయి. మామూలుగానే చాలా రాష్ట్రాల్లో రేషన్ ఉచితం అన్నట్టుగా ఉంది పరిస్థితి. బియ్యం రూపాయికి ఇస్తున్నారు. ఇక అర కేజీ చక్కెర ఇస్తారు. ఇక రేషన్ అంటే అంతకన్నా ఇవ్వడం లేదు. మోడీ ప్రకటించిన ఉచిత రేషన్ లో బహుశా బియ్యం లేదా గోధుమలు ఉండవచ్చు! అంతకు మించి ఏం ఉండకపోవచ్చు.
మరి ఈ పథకంతో మోడీకి ఎందుకు క్రెడిట్ వెళ్లాళి అన్నట్టుగా ఆయనతో ఢీ అనే పశ్చిమ బెంగాల్ సీఎం ఇదే పథకానికి కొనసాగింపును అనౌన్స్ చేశారు. నవంబర్ వరకూ రేషన్ ఫ్రీ అని మోడీ అంటే, తను వచ్చే ఏడాది జూన్ వరకూ ఉచిత రేషన్ ఇవ్వబోతున్నట్టుగా మమత ప్రకటించేశారు! మోడీ అలా ప్రకటించిన వెంటనే, మమత నుంచి కూడా ప్రకటన వచ్చేసింది. రేషన్ తో ఏదైనా క్రెడిట్ పొందాలని మోడీ భావిస్తుంటే, తన రాష్ట్రం వరకూ దానికి అవకాశమే లేకుండా.. మమత ఏడాది పాటు ఉచిత రేషన్ అంటూ ప్రకటించేశారు! ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉచిత రేషన్ ఇస్తూ ఉండటం, ఇప్పుడు మమత లాంటి వాళ్ల కౌంటర్లు, ఇంత కష్టంలో రేషనేనా.. అనే సామాన్యుల మాటలు.. మోడీ ఉచిత వరాన్ని మరీ చిన్నదిగా చేసేస్తూ ఉన్నాయి.
లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ
మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్