చాన్నాళ్ల తర్వాత కెమెరాల ముందుకు వచ్చింది సారా అలీఖాన్. లాక్ డౌన్ వేళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఇంట్లోంచి ఫొటోలు అప్ లోడ్ చేయడమే తప్ప, ఆ జిమ్ ల వద్దనో, ఏ ఫంక్షన్ సమయంలోనో, డిన్నర్ డేట్ లలోనో వారు కనిపించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎలాగూ ఇప్పుడు లాక్ డౌన్ నుంచి ముంబై వంటి చోట కూడా పాక్షిక మినహాయింపులున్నాయి. ఈ క్రమంలో మీడియా ఫ్రెండ్లీ సారా అలీఖాన్ కనిపించింది. ఒక సినిమా ఆఫీస్ బయట ఇలా కనిపించింది ఈ యంగ్ హీరోయిన్.
పింక్ డ్రస్ లో ఇలా క్యూట్ గా కనిపించింది సారా. ఇక తనదైన నమస్తే సిగ్నేచర్ పోజులో ఆకట్టుకుంది. కరోనా వ్యాపిస్తున్న సమయంలో షేక్ హ్యాండ్స్ వద్దని, నమస్తే మేలని ప్రపంచమంతా గట్టిగా ప్రచారం సాగుతున్న సమయంలో సారా అలీఖాన్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే.. కెమెరాలు కనపడగానే పై ఫొటో స్టైల్లోనే నమస్తే పెడుతూ ఉంటుంది సారా. నమస్తే పెట్టడంలో సారా అలీఖాన్ ను చూసి నేర్చుకోవాలన్నట్టుగా సినిమా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ మినహాయింపుల వేళ తొలి సారి కనిపించి తనదైన శైలిలోనే పలకరించింది సారా.
మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్