అది దగ్గు మందు.. మాట మార్చిన పతంజలి

వారం నుంచి 10 రోజుల్లో కరోనా తగ్గిపోతుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. వంద మందిలో 65 మందికి కరోనా తగ్గిపోయిందని కూడా ప్రకటించుకుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు కరోనిల్ మెడిసిన్ …

వారం నుంచి 10 రోజుల్లో కరోనా తగ్గిపోతుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. వంద మందిలో 65 మందికి కరోనా తగ్గిపోయిందని కూడా ప్రకటించుకుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు కరోనిల్ మెడిసిన్  ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పుకొచ్చింది. కట్ చేస్తే.. సరిగ్గా వారం రోజుల కిందట తాము చెప్పిందంతా కరోనా గురించి కాదంటూ బుకాయించింది పతంజలి.

అవును.. పతంజలి మాట మార్చింది. హరిద్వార్ లోని తమ పతంజలి యోగపీఠ్ లో ఘనంగా చెప్పిందంతా కరోనా గురించి కాదంట, దగ్గు గురించట. ఇలా తాము కనిబెట్టిన మందులు కరోనా నివారణకు కాదంటూ ప్లేట్ ఫిరాయించింది పతంజలి. జనాల్ని బుకాయించి, తిమ్మినిబమ్మిని చేసి కోట్ల రూపాయలు కొట్టేద్దామనుకున్న పతంజలి ప్లాన్ కు గండిపడింది.

లక్షలాది మంది కరోనిల్ మందుపై అనుమానాలు వ్యక్తంచేయడంతో స్వయంగా కేంద్రం ఈ మెడిసిన్ సరఫరాను నిషేధించింది. అటు ఉత్తరాంఖండ్ ప్రభుత్వం కూడా కరోనిల్ పై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. దగ్గు మందు తయారుచేస్తామంటూ లైసెన్స్ తీసుకొని కరోనా నివారణకు మందు కనిబెట్టామని ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఆంతర్యమేంటో చెప్పాలని ఆదేశించింది.

దీంతో పతంజలి లైన్లోకి వచ్చింది. తాము దగ్గు మందుకే లైసెన్స్ తీసుకున్నామని ఒప్పుకుంది ఆ సంస్థ. కరోనా కిట్ అనే పేరును ఎక్కడా వాడడం లేదని హామీ ఇచ్చిన పతంజలి.. దివ్య స్వాసరివతి, దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్ల అనుతేల్ అనే మందులతో కూడిన ప్యాకేజీని మాత్రమే షిప్పింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని ఎక్కడా చెప్పలేదన్న ఆ సంస్థ.. మెడిసిన్ ప్రయోజనాల్ని మాత్రమే చెప్పామంటోంది.

మరోవైపు దివ్య కరోనిల్ పేరిట టాబ్లెట్లు పంపిణీ చేయడాన్ని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరులో కరోనిల్ అని ఉంటే అది కరోనా నివారణకు ఉపయోగపడుతుందని చాలామంది భ్రమపడే అవకాశం ఉందని, ఆ పేరును తక్షణం మార్చాలని.. ఆల్రెడీ షిప్పింగ్ అయిన కరోనిల్ టాబ్లెట్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా కొన్ని స్వచ్చంధ సంస్థలున్నాయి.

మొత్తమ్మీద దగ్గు మందుకు లైసెన్స్ తీసుకొని కరోనిల్ అంటూ భారీగా ప్రచారం చేసిన పతంజలి గుట్టు రట్టయింది. ఆ సంస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది.

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి: ప్రధాని మోదీ

మాస్క్ ధరించమన్న మహిళా ఉద్యోగిని చితక్కొట్టిన డిప్యూటీ మేనేజర్