అప్పు కధ… అప్పుడే మొదలైంది…

అవును అప్టూ డేట్ గా ఉండాలంటే ఎవరైనా అప్పులు చేయాల్సిందే. అప్పు చేయడం అంటే తప్పు చేయడం మాత్రం కాదు. అది అవసరం కూడా. ఏపీ అప్పులు చేస్తోంది. విచ్చల విడిగా ఖర్చు చేస్తోంది.…

అవును అప్టూ డేట్ గా ఉండాలంటే ఎవరైనా అప్పులు చేయాల్సిందే. అప్పు చేయడం అంటే తప్పు చేయడం మాత్రం కాదు. అది అవసరం కూడా. ఏపీ అప్పులు చేస్తోంది. విచ్చల విడిగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రం కుదేల్ అయిపోయింది అంటూ విపక్షాలు అంటున్న మాటలు, చేస్తున్న విమర్శలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తనదైన శైలిలో బదులిచ్చారనుకోవాలి.

ఏపీలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చక్కగా సాగుతోంది. జగన్ గ్రామాల మీద దృష్టి పెట్టి పూర్తిగా పల్లెసీమలను పసిడి సీమలుగా మారుస్తున్నారని కితాబు ఇచ్చారు. మహాత్ముడు చెప్పినట్లుగా గ్రామాభ్యుదయమే తన లక్ష్యమని సీఎం భావిస్తూ ఆ దిశగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కూడా తమ్మినేని అంటున్నారు.

అప్పులు చేస్తున్నారు, ఏపీ అప్పుల కుప్పగా మారింది అంటూ వస్తున్న విమర్శలు అర్ధ రహితమని అంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తరువాత ఏపీ లక్షా 18 వేల కోట్ల అప్పుతోనే రాష్ట్రంగా ఏర్పడింది అన్నది గుర్తుంచుకోవాలని ఆయన అంటున్నారు.

అంటే ఏపీ అప్పు కధ రాష్ట్రంతో పాటే వచ్చిందని ఆయన చెబుతూ గత పాలనలోనూ పెద్ద ఎత్తున అప్పులు చేశారు అని పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం అప్పు తెచ్చిన ప్రతీ పైసా పేదల కోసమే ఖర్చు చేస్తోందని తమ్మినేని గట్టిగానే చెబుతున్నారు. మొత్తానికి అప్పు డేట్లు, ఏపీకి కొత్త కాదు, వింతా కాదు అన్నది స్పీకర్ గారి భావన.