జనసేన సింబల్ తో భగత్ సింగ్ వచ్చేసాడు

గబ్బర్ సింగ్ గా హల్ చల్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు భగత్ సింగ్ గా రాబోతున్నాడు. మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించబోయే పవన్…

గబ్బర్ సింగ్ గా హల్ చల్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు భగత్ సింగ్ గా రాబోతున్నాడు. మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించబోయే పవన్ కళ్యాణ్ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 

ఈ టైటిల్ ను గ్రేట్ ఆంధ్ర కొద్ది రోజులు ముందుగానే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు అదే టైటిల్ ను అనౌన్స్ చేసారు కరోనా సోకక ముందు పవన్ తో ఓ ఫొటో షూట్ చేసి వుంచారు. అనేక కారణాల వల్ల అది అలా వుండిపోయింది. ఇప్పుడు అందులోనే స్టిల్ నే వదిలారు. మాంచి క్రేజీ బైక్ మీద జనసేన సింబల్ అయిన టీ గ్లాస్ పట్టుకుని పవన్ కనిపించారు. 

భారతీయ యువత గర్వంగా తలచుకునే టైటిల్. విదేశీ బైకు, స్వదేశీ టీ గ్లాస్ ఈ మూడింటితో కూడిన స్టయిలిష్ గెటప్ లో పవన్ కళ్యాణ్.  ప్రస్తుతం నిర్మాణంలో వున్న రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత ఈ సినిమా మీదకు వస్తారు పవన్.