టీవీ9 పరువు తీసిన రామ్ గోపాల్ వర్మ

సందర్భం దొరికిన ప్రతిసారి రామ్ గోపాల్ వర్మను తిడుతుంటుంది టీవీ9. అదేదో రామ్ గోపాల్ వర్మపై ఉన్న కోపం కాదు, తమ ఛానెల్ టీఆర్పీ కోసం. ఇటు రామ్ గోపాల్ వర్మ కూడా టైమ్…

సందర్భం దొరికిన ప్రతిసారి రామ్ గోపాల్ వర్మను తిడుతుంటుంది టీవీ9. అదేదో రామ్ గోపాల్ వర్మపై ఉన్న కోపం కాదు, తమ ఛానెల్ టీఆర్పీ కోసం. ఇటు రామ్ గోపాల్ వర్మ కూడా టైమ్ దొరికినప్పుడల్లా టీవీ9ను విమర్శిస్తూనే ఉంటాడు. అదేదో టీవీ9పై కక్ష కాదు. సంచలనాల కోసం. ఇలా ఆర్జీవీ-టీవీ9 కాపురం “6 కాంట్రవర్సీలు-3 టీఆర్పీలు” అన్నట్టు అన్యోన్యంగా సాగిపోతుంటుంది. జనాలు వీళ్ల కాపురాన్ని చూసి నవ్వుకోవడం కూడా అంతే సాధారణంగా జరిగిపోతుంటుంది.

తాజాగా మరోసారి ఆర్జీవీని తమ ఛానెల్ లోకి లాక్కొచ్చింది టీవీ9. ఈసారి తెరపై ఉన్న యాంకర్ దేవి. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సరిగ్గా 3 రోజుల కిందట భారీ వర్షాల గురించి ఏదో చెప్పబోయి, రుధిరం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా లైవ్ లో ఎడాపెడా వాగేసిన యాంకరమ్మ ఈమెనే.  అలా 3 రోజులుగా ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది.

ఇప్పుడు అదే యాంకర్ కు వర్మ చేతిలో చావుదెబ్బ తగిలింది. టీవీ9ను వర్మ ఎడాపెడా తిడుతుంటే, సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంటే.. ఎలా అడ్డుకోవాలో తెలియక, ఎలా వాదించాలో అర్థంకాక బిక్కచూపులు చూసింది దేవి.

ఇంతకీ ఏం జరిగింది..?

ఎప్పట్లానే తనదైన శైలిలో అషురెడ్డి మీద ఓ వీడియో తీశాడు వర్మ. మొన్న అరియానాపై తీసిన వీడియో కంటే ఇది ఇంకాస్త ఘాటుగా ఉందన్నమాట. ఈ కోణంలో వర్మతో ఆడుకోవాలనుకుంది టీవీ9. అతడ్ని కార్నర్ చేసి ఏదో చేసేద్దాం అనుకుంది. దేవిని రంగంలోకి దించింది. ఇలా షో మొదలైందో లేదో అలా యాంకర్ దేవిపై, టీవీ9పై రివర్స్ లో కామెంట్స్ అందుకున్నాడు వర్మ.

“ఆర్జీవీ లైన్లో ఉన్నారు. బోల్డ్ కామెంట్స్ వినిపిస్తాయి, సెన్సార్ డైలాగ్స్ వినిపిస్తాయి. టీవీల ముందు పిల్లలుంటే కాస్త పక్కకు తీసుకెళ్లండి” అంటూ దేవి ఏదో చెప్పబోయింది. వెంటనే అందుకున్న వర్మ ఇలా చెప్పడం స్టుపిడ్ అన్నాడు. పిల్లల్ని టీవీ చూడొద్దని చెబితే, పక్కకెళ్లి పోర్న్ చూస్తారంటూ తనదైన స్టయిల్ లో
రెచ్చిపోయాడు.

“మేం మెరుగైన సమాజం కోసం ఏదైనా చేస్తామని, విలువలు ఫాలో అవుతున్నామని” దేవి చెప్పడంతో ఫక్కున నవ్వాడు వర్మ. మీ ఛానెల్ బాగోతం మొత్తం నాకు తెలుసు, రేటింగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు, దిగజారిపోతారు అనే అర్థం వచ్చేలా ఏకి పడేశాడు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది ఎక్కువ  సాగదీయకు అంటూ చురకలంటించాడు. దీంతో యాంకరమ్మ కాసేపు అయోమయంలో పడింది. వెంటనే తేరుకొని టాపిక్ ను టీవీ9ను తిట్టడం నుంచి, వర్మ తీసిన వీడియో వైపు మళ్లించింది.

అసలు మతలబు ఇది

దాదాపు గంట పాటు సాగిన ఈ ప్రహసనంలో కొసమెరుపు ఏంటంటే.. ఇదేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం టీవీ9 పెట్టిన కార్యక్రమం కాదు. అలా అని వర్మను కార్నర్ చేయడం కోసం ఏర్పాటుచేసిన వేదిక కూడా కాదు. కేవలం తిట్టుకోవాలి, వర్మకు పబ్లిసిటీ ఇవ్వాలి, టీవీ9కు టీఆర్పీ రావాలి. 

ఇలా సింగిల్ పాయింట్ ఎజెండాతో షో చేసి, పరమ చెత్త కంటెంట్ ను ప్రేక్షకులపై రుద్దారు. ఏతావతా దీనివల్ల దేవికి మాత్రం చిన్న ఉపయోగం కలిగింది. ఈ వర్మ షోతో ఆమె “రుధిరం విరిగిపడింది, రుధిరం పగబట్టింది” లాంటి ట్రోలింగ్స్ నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడింది.