''సెక్స్ రాకెట్ గుట్టురట్టు'' అనే హెడ్డింగ్ చాలా కామన్ గా చూస్తుంటాం. కానీ అందరూ అనుకునే ప్రదేశాల్లో ఇప్పుడివి జరగట్లేదు. ఎవరూ ఊహించని ప్రదేశాల్లో జరుగుతున్నాయి. హైటెక్ వ్యభిచారం కొత్త పుంతలు చూసి పోలీసులే నోరెళ్లబెడుతున్నారంటే.. వ్యభిచారం ఏ రేంజ్ కు చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇలాంటిదే ఓ హైటెక్ సెక్స్ రాకెట్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ సెక్స్ రాకెట్ లో అంతా విదేశీ అమ్మాయిలే..!
ఎలా తీసుకొస్తారు..?
విదేశీ అమ్మాయిల్ని విజిటింగ్ వీసాలపై ఇండియాకు తీసుకొస్తారు. అలా వచ్చిన అమ్మాయిల్ని ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. మరో వ్యక్తి మధ్యలో చేరుతాడు. రిసీవ్ చేసుకున్న వ్యక్తి తప్పుకుంటాడు. ఇక అతడే వీళ్లను వివిధ నగరాలకు తిప్పుతుంటాడు. మరీ ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్, అడ్వాన్స్ పేమెంట్ పూర్తయిన తర్వాతే వీళ్లను ఇండియాకు రప్పిస్తారు.
ఉబ్జెకిస్థాన్, కజకిస్థాన్, థాయ్ లాండ్ లాంటి దేశాల నుంచి అమ్మాయిల్ని ఇలా రప్పిస్తారు. వాళ్లను నేరుగా ఫైవ్ స్టార్ హోటల్స్ కు తరలిస్తారు. హైటెక్ వ్యభిచారం మొత్తం అక్కడే జరుగుతుంది. ఈ అమ్మాయిల్ని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో తిప్పుతారు. వీసా గడువు ముగిసిన తర్వాత వీళ్లను పంపించేస్తారు. ఒకవేళ గడువు ముగిసినా ఇక్కడే ఉండి, ఇదే వృత్తిని కొనసాగించాలనుకునే వాళ్లకు నకిలీ ఆధార్ కార్డులు, అడ్రెస్ ప్రూఫ్ లు వీళ్లే తయారుచేసి ఇస్తారు.
ఒక్కో దేశానికి ఒక పండు పేరు?
ఈ హైటెక్ వ్యభిచారాన్ని ఒరిస్సాకు చెందిన మణికేష్ యాదవ్ పకడ్బందీగా నడుపుతున్నాడు. ఇతగాడి వ్యవహారం మొత్తం కోడ్ భాషలోనే నడుస్తుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియా అమ్మాయి కావాలంటే ఆపిల్స్ ఉన్నాయా అని అడగాలి. థాయ్ లాండ్ అమ్మాయిలు కావాలంటే చెర్రీలు కావాలని మెసేజ్ పెట్టాలి.
డేట్, టైమ్, ప్లేస్ ఇతడే ఫిక్స్ చేస్తాడు. ముందే డబ్బులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత చెప్పిన టైమ్ కు విదేశీ అమ్మాయి వచ్చేస్తుంది. ఈ వ్యవహారాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే జరుగుతాయి. నెల రోజుల ముందే వీళ్లు సదరు హోటల్స్ లో రూమ్స్ బుక్ చేస్తున్నారంటే ఎంత పకడ్బందీగా ఇది సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఎలా దొరికారు…?
గడిచిన వారం రోజులుగా నగరంలో ఉన్న విదేశీయులపై కన్నేశారు పోలీసులు. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు ఇలా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అదే టైమ్ లో కొంతమంది విదేశీ అమ్మాయిలు గచ్చిబౌలిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో దిగారనే సమాచారం పోలీసులకు అందింది.
డ్రగ్స్ ముఠా అనే అనుమానంతో పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించగా.. ఈ హైటెక్ వ్యభిచారం దందా బయటపడింది. మధ్యమర్తి మొబైల్ లో హైదరాబాద్ కు చెందిన ఎంతోమంది ప్రముఖుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ ఛాట్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.