నేచురల్ స్టార్ నాని ఎంత సాదాసీదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేచురల్ స్టార్ అనే బిరుదుకు ఆయన నూటికి నూరు శాతం అర్హుడే. నాని ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాడనే మాట కంటే జీవిస్తాడంటేనే సరిపోతుంది. నాని భార్య అంజనా యలపర్తి కూడా భర్తకు తగ్గ భార్యే.
సోషల్ మీడియాలో ఆమె యాక్టీవ్‌గా ఉంటారు. కుటుంబ సంబంధ ఫొటోలను ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తూ…నాని అభిమానులను అలరిస్తుంటారు. తద్వారా తనకు కూడా అభిమానులను సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. నేచురల్ స్టార్ నాని భార్య ఇటీవల కొత్త అవతారం ఎత్తారు. గాయనిగా ఆమె సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకోవడం ప్రశంసలు కురిపిస్తోంది.
తన స్నేహితురాలితో కలిసి ఆమె గొంతెత్తారు. ప్రేమికుడు చిత్రంలోని 'అందమైన ప్రేమరాణి చేయి తగిలి' అనే పాట పాడి ఆమె అభిమానుల్ని అలరించారు. ఊపు తెచ్చే పాటను ఎంచుకోవడంతో పాటు అందుకు తగ్గట్టు అంజనా హావభావాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.